Traffic Police Tweet: తండ్రీకొడుకుల వాట్సాప్ చాట్‌ను ట్వీట్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. సోషల్ మీడియాలో వైరల్

|

Jan 21, 2021 | 6:13 PM

Traffic Police Tweet:  ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారిని రోజు ఎంతో మందిని చూస్తూనే ఉన్నాము. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. అయినా..

Traffic Police Tweet: తండ్రీకొడుకుల వాట్సాప్ చాట్‌ను ట్వీట్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. సోషల్ మీడియాలో వైరల్
Follow us on

Traffic Police Tweet:  ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారిని రోజు ఎంతో మందిని చూస్తూనే ఉన్నాము. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. అయినా వాహనదారులు రూల్స్‌ అతిక్రమిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు పలు రకాలుగా వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు. ప్రతి రోజు ఎంతో మంది ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంగిస్తుండటంతో జరిమానాతో పాటు కేసులు కూడా నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలపై ప్రచారానికి పోలీసులు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తూ అవగాహన కలిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగే అనర్థాలను వివరిస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించకుండా పోలీసులు వీడియో సందేశాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఓ ట్వీట్ చేశారు. మీ పిల్లలు బండి నడిపే ప్రవర్తనపై నిఘా పెట్టండి.. వారు తరచూ ఉల్లంఘనలు చేస్తూ ఉంటే వారికి బండి ఇవ్వకండి.. మీ బండిపై పడే చలానాలు ఈ కింది లింక్‌ ద్వారా తెలుసుకోండి.. అంటూ ఓ హెచ్చరిక లాంటి సూచన చేస్తూ ట్వీట్‌ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఓ సరదా వాట్సాప్‌ చాట్‌ను పోలీసులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఆ పోస్టు వైరల్‌గా మారింది.

ట్రాఫిక్‌ చలాన్లు నేరుగా తండ్రి మొబైల్‌కు చేరుకోగా, ఆ మెసేజ్‌ను చదివిన తండ్రి దానిని తన కొడుకు వాట్సాప్‌ నంబర్‌కు పంపిస్తాడు. ‘ఏంట్రా ఇది’ అంటూ కొడుకును తండ్రి ప్రశ్నించగా, ఏమో నాన్న రాంగ్‌ చలానా అనుకుంటా.. అంటూ బదులిస్తాడు. అవునా… మరి ఇదేంటో అంటూ ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించిన చలాన్‌కు సంబంధించిన ఫోటోను కొడుకుకు ఫార్వాడ్‌ చేస్తాడు. అది చూసిన కొండుకు ‘సారీ నాన్న.. కాలేజీకి వెళ్లే తొందరలో వెళ్లాను.. అంటూ రిప్లై ఇస్తాడు. మీ కాలేజీ కోఠిలో కదరా. ఆర్బిట్‌మాల్‌లో స్పెషల్‌ క్లాస్‌ చెబుతున్నారా.. ఇంటికి రా మాట్లాడాలి.. అంటూ షాకిస్తూ కొడుకుకు రిప్లై ఇస్తూ ఏమోజీని జోడిస్తాడు తండ్రి. కోఠికి ఏ బస్సు వెళుతుందో తెలుసుకుని రా.. రేపటి నుంచి అందులోనే వెళ్లాలి.. అంటూ కొడుకుతో తండ్రి చాటింగ్‌ ముగిస్తాడు.

అయితే వాట్సాప్‌లో తండ్రీకొడుకుల మధ్య జరిగిన సంభాషణ ట్వీట్‌కు సోషల్‌ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. మంచి సందేశమిచ్చారంటూ పోలీసులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.