Hyderabad: అధిక లాభాలు వస్తాయని.. షార్ట్ టైమ్‌లో కరోడ్‌పతి కావాలని ఆన్‌లైన్‌లో ఊరించే ఆఫర్లను నమ్మితే.. బంగారుకత్తితో గొంతుకోసుకోవడమే. ఆన్‌లైన్ గేమింగ్‌తో ఎందరో జీవితాలు బలయ్యాయి. తాజాగా ఆన్‌లైన్ ట్రేడ్ యాప్ డేంజర్ బెల్ తెరపైకి వచ్చింది. ఇలా పెట్టుబడి పెడితే అలా రెట్టింపు ఖాయమనే ప్రకటనలు నమ్మితే కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. కానీ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల ఎంట్రీతో ఆ గ్యాంగ్‌కు రంగుపడింది.
సైబర్ క్రైమ్స్ చేయడంలో నేరగాళ్లది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఒకరు జస్ట్ ఎస్‌ఎంఎస్ తో అకౌంట్‌లు ఖాలీ చేసేస్తే.. ఇంకొకడు మిస్ట్ కాల్‌తో బ్యాంకు ఖాతాను గుల్ల చేసేస్తాడు. సైబరాబాద్ పోలీసులకు చిక్కిన నలుగురు సైబర్ నేరగాళ్లు ఏకంగా మూడు వేల మందికి టోకరా కొట్టేసారు. నిందితుల నుంచి స్వాదీనం చేసుకున్న నోట్ల కట్టలను చూస్తే.. పోలీసులే ఆశ్చర్యపోయారు.
డబ్బులు ఎవరికీ ఉరికే రావన్న నిండు నిజాన్ని నమ్మకపోతే ఆశలకు తరుగు తప్పదు. మోసపోవడమే కాకుండా అప్పుల ఊబిలో విలవిల్లాడక తప్పదు. నెట్‌చాటున నిత్యం ఎన్నెన్నో మోసాలు. ఊరించే ఫోటోలు.. నరాలను జివ్వుమన్పించే మసాలా వీడియోలు.. హోలో అంటూ కైపెక్కించే హోయలు.. ఇలాంటి మోసాలు ఓ రకం. లింకులు పంపి ఖాతాలను కొల్లగొట్టే దగా మరో రకం. ఈ రెండింటికి మించిన మరో రకం మ్యాటర్ తాజాగా కలకం రేపింది. హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌లైన్‌ట్రేడింగ్ మాఫియా కోట్లలో దోపిడి కి పాల్పడినవైనం తెరపైకి వచ్చింది. పోలీసింగ్‌లో దేశంలోనే నెంబర్ వన్ బ్రాండ్‌గా నిలిచిన తెలంగాణ పోలీసుల తడాఖాతో రాజస్థాన్ గ్యాంగ్‌కు రంగుపడింది.
కట్టలుగా కట్టలుగా నోట్లు.. వీటి విలువ దాదాపు పది కోట్లు. రాజస్థాన్ సైబర్ క్రైమ్ గ్యాంగ్‌ను కటకటాల బాటపట్టించిన సైబరాబాద్ పోలీసులు సీజ్ చేసిన సొమ్ము ఇది. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట ఫేక్ యాప్‌ను క్రియేట్ చేసి తెలంగాణకు చెందిన వందల మందిని కోట్లలో ముంచారు ఈ కేటుగాళ్లు. ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెడితే లచ్చిందేవి లగెత్తుకొచ్చినట్టు లాభాలే లాభాలని ఊరించి.. కోట్లలో క్యాష్ వసూలు చేశారు. పెట్టుబడి పెట్టడమే కానీ రాబడి రూటు కన్పించక పోవడంతో డౌట్ పడిన కొందరు బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తీగ లాగితే రాజస్థాన్, యూపీల్లో ట్రేడింగ్ యాప్ డొంక కలింది.
ఈ కేటుగాళ్లను పట్టుకునేందుకు రాజస్థాన్‌లో 3 నెలల పాటు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజల నుంచి డబ్బు కొట్టేసిన ఈ కేటుగాళ్లు రాజస్థాన్‌లో బడా బిజినెస్ మెన్‌లుగా వెలుగొందడం చూసి షాక్ అయ్యారు. మొత్తంగా వారి ఆటకట్టించి, నలుగురు కేటుగాళ్లను పట్టుకున్నారు. తాజాగా వారిని హైదరాబాద్‌కు వచ్చి.. స్వాధీనం చేసుకున్న మనీని మీడియా ముందు ప్రదర్శించారు. వారిపై కేసు నమోదు చేసి డిమాండ్‌కు తరలించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..