Cyber Crime: ఎస్‌బీఐ ఫేక్ కాల్‌ సెంటర్‌తో ఫ్రాడ్‌.. వివరాలు చెప్పారో సమర్పయామి అనాల్సిందే..!

|

Dec 03, 2021 | 5:49 AM

Cyber Crime: ఇప్పుడు దేశానికే కాదు.. ప్రపంచ దేశాల ముందున్న పెద్ద సమస్య సైబర్ సెక్యూరిటీ. ఎదురుగా ఉండి యుద్ధం చేయడం కాకుండా, చాటుగా మాటు వేసే సైబర్ నేరగాళ్ళు

Cyber Crime: ఎస్‌బీఐ ఫేక్ కాల్‌ సెంటర్‌తో ఫ్రాడ్‌.. వివరాలు చెప్పారో సమర్పయామి అనాల్సిందే..!
Sbi Call Center
Follow us on

Cyber Crime: ఇప్పుడు దేశానికే కాదు.. ప్రపంచ దేశాల ముందున్న పెద్ద సమస్య సైబర్ సెక్యూరిటీ. ఎదురుగా ఉండి యుద్ధం చేయడం కాకుండా, చాటుగా మాటు వేసే సైబర్ నేరగాళ్ళు పాల్పడుతూ చెమటలు పట్టిస్తున్నారు. అవి వ్యక్తిగత అంశాలు కావచ్చు.. ఆర్థిక నేరాలు కావచ్చు. శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించినది కావచ్చు. లేదా ఏకంగా దేశ రక్షణకు సంబంధించినది కావచ్చు. ప్రపంచంలో ఎక్కడో కంటికి కనిపించనంత దూరంలో ఉండి, అనుకున్న చోట మోసాలకు పాల్పడి లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలాంటి మోసాల్లో చిక్కుకుని పోలీసులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా దేశంలోనే అతి పెద్ద కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు.

ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న 14 మందిని మూడు నెలల పాటు కాపు కాసి పట్టుకున్నారు పోలీసులు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఈ ముఠాపై 209 కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 5 వేల కేసులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పోలీసులు. క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ డేటా సేకరించి, వారి క్రెడిట్ కార్డ్ లిమిట్స్ పెంచుతామని చెప్పి మోసం చేస్తున్నట్టు తెలిపారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా సమాచారాన్ని తీసుకుని నకిలీ కాల్ సెంటర్ ద్వారా ఈ కాల్స్ చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాంకింగ్ సెక్టార్ లో వీరికి బాగా అనుభవం ఉండడంతో సైబర్ నేరాలు ఈజీగా చేయగలుగుతున్నట్టు తేలింది. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం.. మీకు లోన్ ఇస్తాం.. క్రెడిట్ లిమిట్ పెంచుతాం అంటూ.. ఎవరైనా పర్సనల్ డీటెయిల్స్.. ఓటీపీలు అడిగితే ఎట్టి పరిస్థి్తుల్లో చెప్పొద్దని సూచిస్తున్నారు పోలీసులు.

Also read:

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్