Telangana: ఓ రెస్టారెంట్‌ నిర్వాకం.. బిర్యానీ రైతాలో పురుగులు.. కంగుతిన్న కస్టమర్

|

Jun 14, 2022 | 1:50 PM

ఓ వ్యక్తి బాగా ఆకలేస్తుందని.. ఓ బిర్యానీ లాగిస్తేకానీ ఆత్మారాముడు శాంతించండు అనుకుని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్‌ చేశాడు. వేడి వేడి బిర్యానీ వచ్చింది.. దాంతోపాటు రైతాకూడా వచ్చింది.

Telangana: ఓ రెస్టారెంట్‌ నిర్వాకం.. బిర్యానీ రైతాలో పురుగులు.. కంగుతిన్న కస్టమర్
Restarent
Follow us on

Telangana: అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు.. ఆకలి వేసినవారికి ఆకలి తీర్చడం అన్నం పెట్టడం అన్నికార్యక్రమాల్లో ఉన్నతమైనదని సనాతన ధర్మం చెబుతోంది. అయితే ఇప్పుడు అన్నదాన సత్రాలు లేవు.. వాటిస్తానంలో ఆకలి తీర్చడానికి హోటల్స్ రెస్టారెంట్లు వెలిసాయి. దీంతో ఎవరికైనా ఎప్పుడైనా ఆకలి వేస్తె.. వెంటనే సమీపంలో ఉన్న హోటల్స్ వైపు దృష్టి సారిస్తారు. తమ ఆకలిని తీర్చుకుంటారు. తాజా ఓ వ్యక్తి బాగా ఆకలేస్తుందని.. ఓ  బిర్యానీ లాగిస్తేకానీ ఆత్మారాముడు శాంతించండు అనుకుని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్‌ చేశాడు. వేడి వేడి బిర్యానీ వచ్చింది.. దాంతోపాటు రైతాకూడా వచ్చింది. గుమగుమలాడుతున్న బిర్యానీ గబగబా లాగించేద్దామనుకుంటే పక్కనే ఉన్న రైతాను చూసి ఖంగుతిన్నాడు కస్టమర్‌…అసలేం జరిగిందంటే…

నిజామాబాద్ నగరంలోని లోవీ విందు భోజనం అనే రెస్టారెంట్‌కి వెళ్లారు ఓ కస్టమర్‌. అక్కడ బిర్యానీతోపాటు సర్వ్‌ చేసిన రైతాలో పురుగులు కనిపించడంతో హోటల్‌ యాజమాన్యానికి కంప్లయింట్‌ చేశాడు. అయితే వారు పట్టించుకోకపోగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సైతం ఇక్కడ తనిఖీలు నిర్వహించకపోవడంతో రెస్టారెంట్‌ నిర్వాహకులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. క్వాలిటీ లేని ఫుడ్‌ సప్లయ్‌ చేస్తూ.. అర్ధరాత్రి వరకూ రెస్టారెంట్లు నడుపుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదంటున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..