Covid-19: మావోయిస్టులపై కరోనా పంజా.. పలువురు అగ్రనేతలకు పాజిటివ్..? పోలీసుశాఖ అప్రమత్తం

|

Jun 09, 2021 | 2:29 PM

Covid-19 Effect On Maoists: ఖాకీలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మావోయిస్టులను ఇప్పుడు కరోనా వణికిస్తోంది. కరోనా బారిన పడి వైద్యం కోసం వస్తూ పోలీసులకు చిక్కిన మధుకర్ కన్నుమూసిన సంగతి

Covid-19: మావోయిస్టులపై కరోనా పంజా.. పలువురు అగ్రనేతలకు పాజిటివ్..? పోలీసుశాఖ అప్రమత్తం
Maoists
Follow us on

Covid-19 Effect On Maoists: ఖాకీలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మావోయిస్టులను ఇప్పుడు కరోనా వణికిస్తోంది. కరోనా బారిన పడి వైద్యం కోసం వస్తూ పోలీసులకు చిక్కిన మధుకర్ కన్ను మూసిన సంగతి తెలిసిందే. మరి మిగిలిన మావోయిస్టు అగ్ర నేతల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలువురు మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారిన పడి ట్రీట్మెంట్ అందక మన్యంలో మగ్గుతున్నారని తెలుస్తోంది. పోలీసులకు చిక్కిన కీలక నేత సమాచారం ద్వారా వరంగల్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కోవిడ్ బారినపడి చికిత్స కోసం వచ్చిన మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ మోహన్ అలియాస్ సోబ్రాయ్ ఈ నెల 2వ తేదీన వరంగల్ పోలీసులకు చిక్కాడు.. ఇతనితో పాటు మరో మైనర్ మావోయిస్టు కొరియర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరి విచారణలో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం ఆరోగ్య సంక్షోభంలో ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రకటించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ నగరానికి వచ్చి పోలీసులకు పట్టుబడ్డ మావోయిస్టుల ద్వారా కీలక విషయాలు రాబట్టమన్నారు. ఆతర్వాత గడ్డం మధుకర్ కరోనాతో చనిపోయాడు.

అయితే, మధుకర్ పట్టుబడిన సమయంలో వరంగల్ పోలీసులకు కీలక సమాచారం అందించారని తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది కీలక నాయకులతో పాటు పార్టీ సభ్యులు కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారిలో కటకం సుదర్శన్ ఆలియాస్ ఆనంద్, తిప్పరి తిరుతి ఆలియాస్ దేవుజీ, యాప నారాయణ ఆలియాస్ హరిబూషణ్, బడే చోక్కారావు ఆలియాస్ దామోదర్, కటకం రాజిరెడ్డి ఆలియాస్ ధర్మన్న, కట్టా రాంచందర్ రెడ్డి ఆలియాస్ వికల్స్, ములా దేవేందర్ రెడ్డి ఆలియాస్ మాస దడ, కున్ కటి వెంకటయ్య ఆలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ ఆలియాస్ రఘు, కొడి మంజుల ఆలియాస్ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత ఆలియాస్ బుర్రా అనే పన్నెండు మంది ముఖ్య నేతలు కూడా కోవిడ్ తో బాధపడుతున్నట్లు ప్రకటించారు.

అయితే కరోనా బారిన పడ్డ ముఖ్యనేతలు లొంగిపోతే తామే మెరుగైన వైద్యసేవలు అందిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే కొందరు మావోయిస్టులు దొంగదారిలో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రులపై నిఘా పెంచారు. ఎంజీఎం ఆస్పత్రితో పాటు వివిధ పలు ప్రైవేటు ఆస్పత్రులపై డేగకన్ను పెట్టారు. మావోయిస్టులకు ట్రీట్మెంట్ అందించే విషయంలో సహాయం అందిస్తున్న ఏజెన్సీలోని వ్యాపారులు, కాంట్రాక్టర్లు, చోటామోటా నేతల వివరాలు ఆరా తీస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మావోయిస్టులు తమను ఆశ్రయించి లొంగిపోతే వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు.

Also read:

యాంటీ బాడీల వృద్ధికి మాస్ వ్యాక్సినేషన్ పరిష్కారం…..లక్నో మెడికల్ యూనివర్సిటీ రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడి

Mehul Choksi: మెహుల్‌ చోక్సీకి నో బెయిల్‌.. విచారణను వాయిదా వేసిన డొమినికా కోర్టు..