Shilpa Cheating Case: శిల్పా చౌదరి బాధితుల లిస్ట్ రోజు రోజుకూ పెరగడమే కాదు.. ఆమె క్రైమ్ హిస్టరీ ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ఈ కేసులో మున్ముందు ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయ్.. పోలీసుల ఇంటరాగేషన్‌లో ఏం తేలబోతోందనేది ఆసక్తిగా మారింది. కాగా, మాయమాటలతో కోట్లు కొల్లగొట్టిన కిలాడీ లేడీ శిల్పా చౌదరికి కోర్టులో చుక్కెదురైంది. ఉప్పర్‌పల్లి కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించింది. ఈ మోసం కేసులో ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్‌కు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం.. శిల్పా చౌదరిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇవాళ్టి నుంచి శిల్పా చౌదరిని విచారించనున్నారు పోలీసులు.
అయితే, శిల్పాచౌదరి చీటింగ్ కేసులో ఒక్కో మోసం బయటపడుతోంది. సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యుల దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పాచౌదరి.. వారికి నకిలీ బంగారం, నకిలీ చెక్కులు అంట గట్టింది. హీరో సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని దగ్గర 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకున్న శిల్పాచౌదరి మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ష్యూరిటీస్‌గా ఇచ్చినట్టు బయట పడింది. చెక్కు మార్చేందుకు ఇండియన్ బ్యాంక్‌కు వెళ్లిన ప్రియదర్శిని.. మోసపోయినట్టు తెలుసుకుని అవాక్కయింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు ప్రియదర్శిని. ఆరు నెలల తర్వాత తిరిగి ఇస్తానని చెప్పి డబ్బు తీసుకుంది. తీరా డబ్బులు అడిగేందుకు ఇంటికి వెళ్తే.. బౌన్సర్లతో బెదిరించినట్టు ఆరోపిస్తు్న్నారు ప్రియదర్శిని.
శిల్ప బాధితుల్లో ఎక్కువ మంది ప్రముఖులే ఉన్నట్లు చెప్తున్నారు పోలీసులు. అయితే కొంత మంది బాధిత బడా మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. బ్లాక్ మనీ, ఐటీకి భయపడి ఫిర్యాదు చేయలేకపోతున్నారని అంచనా. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా డబ్బులిచ్చి తలలు పట్టుకుంటున్నారట పేజ్ త్రీ మహిళలు. ఇదిలా ఉంటే.. శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు మరో యాంగిల్ వెలుగు చూసింది. ఈ క్రమంలో శిల్పా చౌదరికి ఉన్న ఆరు బ్యాంక్ అకౌంట్స్‌పై ఆరా తీస్తున్నారు పోలీసులు.
Also read:
HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్ భగాయత్ గజం ఎంతో తెలుసా..
Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్