Telangana: అమాంతం పెరిగిన నాటు కోడి ధర.. ప్రస్తుతం కేజీ రేటు ఎంతంటే..?

| Edited By: Rajitha Chanti

Feb 22, 2024 | 9:24 PM

సమ్మక్క-సారక్క అనుబంధ అలయాలలో భక్తులు పోటెత్తున్నారు. అమ్మవారికి మొక్కు సమర్పించిన తరువాత జాతర సమీపంలోనే విందు చేసుకుంటున్నారు.  గత జాతరతో పోలిస్తే ఇప్పుడు నాటుకోళ్ళ ధరలు ముప్పై ఐదు‌ శాతానికంటే అదనంగా పెరిగాయి. అయితే ‌ఇప్పుడు నాటుకోళ్ళు‌ గ్రామాలనుండి తీసుకువచ్చి అమ్ముతున్నారు.

Telangana: అమాంతం పెరిగిన నాటు కోడి ధర.. ప్రస్తుతం కేజీ రేటు ఎంతంటే..?
Country Chicken
Follow us on

తెలంగాణలో ఎటుచూసినా సమ్మక్క సారక్క జాతర హడవుడి‌ కనబడుతుంది. ముల్లె, మూట సర్ధుకొని జాతరకి బయలుదేరుతున్నారు భక్తులు. అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకి జాతరల వద్ద బారులు తీరుతున్నారు. ఎంతో భక్తి భావంతో అమ్మవారికి నాటుకోళ్ళని‌ మొక్కుగా చెల్లిస్తారు. ఇప్పుడు ‌సరైనా‌ ఉత్పత్తి లేకపోవడంతో నాటుకోళ్ళ డిమాండ్ పెరిగింది. జాతర వేళ ధరలు నలభై శాతం‌ కంటే ఎక్కువగా పెరిగిపోయాయి. అయినా సరే..  కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు.

ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాలో మేడారం జాతరకి అనుబంధ జాతరలు నూట యాభైకి పైనే ఉంటాయి. మేడారంకి‌ బయలుదేరే భక్తులందరూ అనుబంధ అలయాలకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా కోరిన కోరికలు తీరితే నాటుకోడినే మొక్కుగా చెల్లిస్తామని భక్తులు మొక్కుకుంటారు. గతంలో పుష్కలంగా ఇంటి వద్ద నాటుకోళ్ళు లభించేవి. కోడి పిల్లప్పుడే అమ్మవారికి మొక్కుకొని జాతరకి మొక్కు‌ ఇచ్చేవారు. కాని ఇప్పుడు నాటుకోళ్ళ జాతి తగ్గిపోతుంది ఈ క్రమంలో మొక్కు కోసం ధర పెరిగిన కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ ‌మార్కెట్ లో నాటుకోడి కిలోకి ఏడువందలకి‌ పైగే ఉంది. ఇక‌ జాతరల వద్ద మరో వంద రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. నాటుకోడి‌ లభించకపోతే తప్పని‌ పరిస్థితిలో బ్రాయిలర్ ‌కోడిని మొక్కుగా చెల్లిస్తున్నారు. ఇప్పటికే అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు.

కాగా సమ్మక్క-సారక్క అనుబంధ అలయాలలో భక్తులు పోటెత్తున్నారు. అమ్మవారికి మొక్కు సమర్పించిన తరువాత జాతర సమీపంలోనే విందు చేసుకుంటున్నారు.  గత జాతరతో పోలిస్తే ఇప్పుడు నాటుకోళ్ళ ధరలు ముప్పై ఐదు‌ శాతానికంటే అదనంగా పెరిగాయి. అయితే ‌ఇప్పుడు నాటుకోళ్ళు‌ గ్రామాల నుండి తీసుకువచ్చి అమ్ముతున్నారు. బ్రాయిలర్ కొళ్ళ‌ పెంపకాల కారణంగా నాటుకోళ్ళ పెంపకం గణనీయంగా తగ్గిపోయింది. సమ్మక్కకి‌ మాత్రం నాటుకోడిని మొక్కుగా చెల్లించడం అనవాయితిగా వస్తుంది. ధరలు పెరిగినా అమ్మవారి కోసం నాటుకోడినే మొక్కుగా చెల్లిస్తున్నామని చెబుతున్నారు భక్తులు.

ఇప్పుడు నాటుకోళ్ళు దొరకడం లేదని, దొరికినా ధర ఎక్కువగా ఉంటుందని భక్తులు చెబుతున్నారు. ప్రస్తుతం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా కిలోకి ఏడు వందలకి పైగానే నాటుకోడి ధర ఉందని‌ అంటున్నారు. నాటుకోళ్ళ ‌పెంపకం తగ్గడంతో‌ ప్రతి‌యేట ధరలు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.ఇప్పుడు సమ్మక్క ‌సారక్క‌ జాతర సందర్భంగా జాతరలు పెరిగాయని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..