Telangana: పొలంలో పత్తిని తెంపి ఇంటికి తెచ్చాడు.. ఆపై ఎండలో ఆరబెట్టగా ఊహించని సీన్

ఆ రైతు పత్తి పంటను కోసి ఇంటికి తీసుకొచ్చాడు. తేమ పోవడానికి ఇంటి ముందు ఆరబెట్టాడు. కాపలా కింద తన తల్లిని కూడా పెట్టాడు. కట్ చేస్తే.! ఆ పత్తి మొత్తం బూడిదైపోయింది. అసలేం జరిగింది.? ఆ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి.

Telangana: పొలంలో పత్తిని తెంపి ఇంటికి తెచ్చాడు.. ఆపై ఎండలో ఆరబెట్టగా ఊహించని సీన్
Telangana News

Edited By: Ravi Kiran

Updated on: Nov 14, 2025 | 10:11 AM

తేమశాతం తగ్గించడం కోసం తెల్ల బంగారాన్ని ఆరబెట్టిన ఆ రైతుకు చివరకు బూడిద మిగిలింది. ఆకస్మాత్తుగా విద్యుత్ షాక్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు పత్తంతా అగ్నికి ఆహుతి అయ్యేలా చేశాయి. రెండు నిమిషాల వ్యవధిలోనే ఆ రైతు కుటుంబం రెక్కల కష్టం అంతా కాలి బూడిదైంది. ఆ సమయంలో ఆ రైతు తల్లి రోదనలు అందరి హృదయాలను చెలింపచేశాయి. ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఇంటికి చేర్చిన చివరకు విద్యుత్ ప్రమాదం రూపంలో అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ విచిత్ర అగ్నిప్రమాదం సంఘటన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం రామ‌చంద్రుతండాలో జరిగింది. బాదావ‌త్ శంక‌ర్ అనే రైతు త‌న పొలంలో వేసిన ప‌త్తిని తెంపి ఇంటికి తీసుకొచ్చాడు. మార్కెట్‌కు వెళితే తేమ ఉందని ఇబ్బందులు పెడతారని ఇంటి ముందు ఆర‌బెట్టాడు. ఆ పత్తి వద్ద రైతు తల్లి కాపలాగా కూర్చుంది.

ఇంతలోనే అకస్మాత్తుగా విద్యుత్..

షార్ట్ స‌ర్క్యూట్‌తో ఆ ప‌త్తికి మంట‌లు అంటుకున్నాయి. క్ష‌ణాల్లోనే ప‌త్తి అంతా కాలి బూడిదైంది. ప‌త్తికి కాప‌లాగా ఉన్న ఆ మ‌హిళ గ‌ట్టిగా కేక‌లు వేయ‌గా ఇరుగుపొరుగు వారు వ‌చ్చి మంట‌ల‌ను ఆర్పేందుకు య‌త్నించారు. కానీ అప్ప‌టికే ప‌త్తి పూర్తిగా దగ్ధ‌మై బూడిద మిగిలింది. రైతు ఇంటి వ‌ద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో అగ్నిప్ర‌మాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. సుమారు రూ. 3 ల‌క్ష‌ల వరకు పంట న‌ష్టం జ‌రిగింద‌ని రైతు శంక‌ర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు..ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఇంటికి చేర్చిన రెక్కల ఇలా కాలి బూడిదవదంతో రైతు కుటుంబం అంతా తల్లడిల్లి పోతున్నారు.