Telangana Corona: తెలంగాణ కరోనా బులిటెన్.. గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు.!

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో..

Telangana Corona: తెలంగాణ కరోనా బులిటెన్..  గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు.!
Corona Cases Telangana

Updated on: Jul 12, 2021 | 7:57 PM

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 696 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,32,379కి చేరింది. ఇందులో 10,148 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,18,496 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 858 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 6 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3735కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 1,05,797 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,98,65,968కి చేరిం.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 35, జీహెచ్ఎంసీ 68, జగిత్యాల 21, జనగాం 6, జయశంకర్ భూపాలపల్లి 15, గద్వాల్ 4, కామారెడ్డి 2, కరీంనగర్ 45, ఖమ్మం 82, ఆసిఫాబాద్ 1, మహబూబ్ నగర్ 8, మహబూబాబాద్ 23, మంచిర్యాల 19, మెదక్ 4, మేడ్చల్ 31, ములుగు 19, నాగర్ కర్నూల్ 4, నల్గొండ 49, నారాయణపేట 3, నిర్మల్ 4, నిజామాబాద్ 7, పెద్దపల్లి 48, రాజన్న సిరిసిల్ల 18, రంగారెడ్డి 33, సంగారెడ్డి 3, సిద్ధిపేట 24, సూర్యాపేట 33, వికారాబాద్ 4, వనపర్తి 6, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ 48, యదాద్రి భోనగిరిలో 21 కేసులు నమోదయ్యాయి.

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు.. అన్ని జిల్లాల్లో ఒకేలా అమలు.. ఎప్పటినుంచంటే.!