Telangana Coronavirus Cases : తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకూ మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 2,91,118కి చేరింది. ఇందులో 4,442 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,85,102 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 253 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1574కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 19,898 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 73,99,436కి చేరింది.
మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు.. సంతాపం తెలిపిన ప్రముఖులు
రైతులతో కేంద్రం తొమ్మిదో విడత చర్చలు.. ఇదే చివరిది అంటూ ప్రచారం.. హాజరయ్యేందుకు రైతుల సుముఖత
Australia vs India : ఆస్ట్రేలియాకు షాక్.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు