Australia vs India : ఆస్ట్రేలియాకు షాక్.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి ఓవర్‌లోనే టీమిండియా షాకిచ్చింది. సిరీస్‌లో సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న డేవిడ్ వార్నర్...

Australia vs India : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి ఓవర్‌లోనే షాకిచ్చింది టీమిండియా. సిరీస్‌లో సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న డేవిడ్ వార్నర్ (1)ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపించేశాడు. తొలి ఓవర్ నాలుగో బంతికి స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఫస్ట్ స్లిప్‌కు కాస్త ముందు పడుతున్న బంతిని రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు. గాయాల కారణంగా మొత్తం కొత్త బౌలర్లతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే వికెట్ దక్కడం ఎంతైనా ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం క్రీజులో మార్కస్ హారిస్, మార్నస్ లబుషేన్ కొనసాగుతున్నారు.
4th Test. 13.1: M Siraj to M Labuschagne (8), 4 runs extras B, 39/2 https://t.co/gs3dZfCcVQ #AUSvIND
— BCCI (@BCCI) January 15, 2021
ఇవి కూడా చదవండి :
IBPS RRB: ఆర్‌ఆర్‌బీ పీఓ స్కోర్ కార్డులను విడుదల చేసిన ఐబీపీఎస్… ఎప్పటిలోపు డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటే.. Formers Protest: బాలీవుడ్ బ్యూటీకి తగిలిన రైతు ఉద్యమం సెగ.. ఆందోళనలకు మద్ధతు ఇవ్వాలంటూ..