Bigg Boss4 Winner Abhijit: బిగ్ బాస్ సీజన్ 4 విజేతకు టీమిండియా వైస్ కెప్టెన్ నుంచి ఊహించని బహుమతి.. గాలిలో తేలిపోతున్న అభిజిత్

రోహిత్ శర్మ మహారాష్ట్ర నుంచి వచ్చినప్పటికీ... అతని మూలాలు తెలుగుగడ్డపై ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతాడు. ఇక మరో తెలుగు తేజం హనుమ విహారి కాకినాడకు చెందిన యువకుడు. వీరిద్దరూ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అభిజిత్ గురించి మాట్లాడుతూ..

Bigg Boss4 Winner Abhijit: బిగ్ బాస్ సీజన్ 4 విజేతకు టీమిండియా వైస్ కెప్టెన్ నుంచి ఊహించని బహుమతి.. గాలిలో తేలిపోతున్న అభిజిత్
Follow us
Surya Kala

|

Updated on: Jan 15, 2021 | 11:52 AM

Bigg Boss4 Winner Abhijit: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అభిజిత్ టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఊహించని గిఫ్ట్ అనుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఉన్న రోహిత్ శర్మ అభిజిత్ కు ఫోన్ చేసి పలకరించాడు.. విన్నర్ గా నిలిచిన అభిజిత్ కు శుభాకాంక్షలు చెప్పాడు. తన ఫేవరేట్ క్రికెటర్ రోహిత్ శర్మ ఫోన్ చేసిన విషయాన్ని అభిజిత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న తెలుగు కుర్రాడు హనుమ విహారీ.. రోహిత్ శర్మ మధ్య మాటల సందర్భంలో తెలుగు బిగ్ బాస్ చర్చకు రాగా విహారీ .. విన్నర్ అభిజిత్ గురించి రోహిత్ శర్మకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అభిజిత్ ను అభినందిస్తూ.. రోహిత్ శర్మ తన జెర్సీని గిఫ్ట్ గా ఇచ్చాడు. జెర్సీ నెంబర్ 45. దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్… రోహిత్ శర్మ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చాడు.

ఫేవరెట్ క్రికెటర్ నుంచి గిఫ్ట్ రావడంతో అభిజిత్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తనకు హెల్ప్ చేసిన హనుమవిహారికి అభిజిత్ థాంక్స్ చెప్పాడు.అంతేకాదు తీవ్ర ఒత్తిడిలో కూడా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నావని ప్రశంసల వర్షం కురిపించాడు. చిన్నప్పుడు తాను క్రికెటర్ అవ్వాలనుకున్నానని ఈ సందర్భంగా అభిజిత్ మరో విషయాన్ని కూడా బయటపెట్టాడు. కానీ, విధి తనను సినిమాల వైపు నడిపించిందని చెప్పాడు. తాను ఎంతగానో అభిమానించే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే… అన్ని పనులను ఆపేసి క్రికెట్ చూస్తూ ఉండిపోతానని అభిజిత్ చెప్పాడు. క్రికెటర్ కావాలనేది చిన్నప్పటి నుంచి తన కోరిక అని తెలిపాడు. అయితే, అది జరగలేదని… జీవితం మరో కోణంలో పయనించిందని.. ఇప్పటికీ క్రికెట్ అనేది తనలోని చిన్న పిల్లాడిని బయటకు తీసుకొస్తుందని తెలిపాడు. ఇప్పుడు క్రికెటర్ నుంచి గిఫ్ట్ అందుకోవడంతో తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని అభిజిత్ ఆనందంలో తేలిపోతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియాకు విజయం వరించాలని, అందరూ సపోర్టు చేయాలని పిలుపునిచ్చాడు అభిజిత్. రోహిత్ శర్మ మహారాష్ట్ర నుంచి వచ్చినప్పటికీ… అతని మూలాలు తెలుగుగడ్డపై ఉన్నాయి. రోహిత్ అమ్మ తెలుగువారే..ఆమె స్వస్థలం వైజాగ్ . దీంతో రోహిత్ శర్మ చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతాడు. ఇక మరో తెలుగు తేజం హనుమ విహారి కాకినాడకు చెందిన యువకుడు. వీరిద్దరూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ ఎప్పుడు తెలుగులోనే మాట్లాడుకుంటారని తెలుస్తోంది.

Also Read: అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణ.. మొద‌ట రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి, ప్రధాని నుంచి సేకరణ