Corona Cases Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. కొత్తగా 5892 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం… ఒక్కరోజులో కరోనాతో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 9122 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,81,640కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 4,05,164 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2625గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 73,851 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కొత్తగా 1104 కేసులు నమోదు అయ్యాయి.
రంగారెడ్డి 443, మేడ్చల్ 378, నల్గొండ జిల్లాలో 323, వరంగల్ అర్బన్ 321, కరీంనగర్ జిల్లాలో 263, నాగర్‌కర్నూలు 204, సిద్దిపేట 201, మహబూబ్‌నగర్ జిల్లాలో 195 కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి 137, వికారాబాద్ 148, వనపర్తి 113, నిజామాబాద్ 139 కేసులు నమోదు అయ్యాయి. జనగాం, జయశంకర్ భూపాళపల్లి, కొమరాంభీం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో తక్కువ కేసులు నమోదు అయ్యాయి.
మరో వైపు కరోనా కేసుల నిర్ధారణ కోసం అన్ని జిల్లాలో ఇంటింటి సర్వేను ప్రారంభించారు. ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు బృందాలుగా ఏర్పడి ఇంటింట సర్వే చేస్తున్నారు. జ్వరం లక్షణాలు ఉన్నవారిన గుర్తించారు. ఇందులో కోవిడ్ లక్షణాలు అధికంగా ఉన్నవారికి ఐసోలేషన్ కిట్స్ అందజేశారు. కొవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని ఏఎన్‌ఎంలు వచ్చి పరిశీలించారు. ఇంట్లోని ప్రతి వ్యక్తికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాల వివరాలను సేకరిస్తున్నారు.
ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..
Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?