Telangana: ఆయన నన్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు.. వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు

పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ అధినేత రాజీవ్ గాంధీ తనను ముఖ్యమంత్రి చేయాలని భావించారని తెలిపారు. కానీ బ్యాడ్ లక్ వల్ల తాను సీఎం కాలేకపోయినట్లు వాపోయారు.

Telangana: ఆయన నన్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు.. వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు
V. Hanumantha Rao

Updated on: May 18, 2023 | 4:44 PM

పీసీసీ మాజీ అధ్యక్షుడు,  సీనియర్ నేత  వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ అధినేత రాజీవ్ గాంధీ తనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయాలని భావించారని తెలిపారు. కానీ బ్యాడ్ లక్ వల్ల తాను సీఎం కాలేకపోయినట్లు వాపోయారు. సమాజంలో హవా ఎక్కడుంటే రాజీకీయ నాయకులు అక్కడికి రావాలనుకుంటారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హవా నడుస్తుందని.. కాంగ్రెస్‌లోకి చాలామంది రావాలనుకుంటున్నారని పేర్కొన్నారు.

అయితే పార్టీలో మాత్రం నిజమైన కాంగ్రెస్ వాదులకే అవకాశాలు ఇవ్వాలని హనుమంతరావు అన్నారు. ఈ విషయంపై పార్టీ హైకమాండ్‌కు చెప్తానని తెలిపారు. అలాగే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా చెబుతానన్నారు. పార్టీలోకి ఎవరైనా వస్తారు.. ఎవరైనా రావచ్చని పేర్కొన్నారు. కానీ వారు పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు ఇవ్వకూడదంటూ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి