AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jana Reddy: బీఆర్ఎస్‌తో పొత్తుపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో కలకలం

బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత పొత్తు తప్పదనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్నికల పొత్తులపై మరో 3 రోజుల్లో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని జానారెడ్డి పేర్కొన్నారు...

Jana Reddy: బీఆర్ఎస్‌తో పొత్తుపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో కలకలం
Jana Reddy
Basha Shek
|

Updated on: Mar 31, 2023 | 5:01 PM

Share

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తుపై టీ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బీఆర్ఎస్‌తో పొత్తుకు సై అంటుండగా.. రేవంత్ వర్గం మాత్రం ఆ వార్తలను ఖండిస్తోంది. బీఆర్ఎస్‌తో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదంటూ గతంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ క్లారిటీ ఇవ్వగా.. బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో పొత్తుకు అనుకూలంగా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత పొత్తు తప్పదనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పొత్తులపై మరో 3 రోజుల్లో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని జానారెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పొత్తులుంటామయని, అవసరమైతే శివసేనతోనూ జత కలుస్తామని జానారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

కాగా కొద్దివారాల క్రితం పొత్తులపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ‘హంగ్‌ వస్తే సెక్యులర్‌ పార్టీలతోనే కలవాలి. రాష్ట్రంలో సెక్యులర్‌ పార్టీ బీఆర్‌ఎస్సే’ అని కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. ఇలా తరచూ పొత్తులపై కాంగ్రెస్‌ నేతల ప్రకటనలతో కాంగ్రెస్‌ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. మరోవైపు ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి బీఆర్ఎస్‌ పోరాటాలు చేస్తోంది. కాంగ్రెస్‌ సారథ్యంలో విపక్షాల మీటింగ్‌లకు కేకే హాజరవుతున్నారు. ఇక రాహుల్‌ లోక్‌ సభ సభ్యత్వాన్ని రద్దు చేసినప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కమిత మూకుమ్మడిగా ఖండించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..