Harish Rao: కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతోంది.. మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా, శివ్వంపేట మండలంలోని దొంతి జీవన్‌దివ్య గార్డెన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

Harish Rao: కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతోంది.. మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao
Follow us
Aravind B

|

Updated on: Mar 31, 2023 | 3:34 PM

రాష్ట్రంలో కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా, శివ్వంపేట మండలంలోని దొంతి జీవన్‌దివ్య గార్డెన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజీపీ లపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండని అన్నారని.. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు కూడా మెదపలేదని మండిపడ్డారు. కానీ రాష్ట్రం వచ్చాక కాంగ్రెస్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు.

అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయలు, నర్సింగ్ కాలేజీలు, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని..కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. గత 9 ఏళ్లలో పెట్రోల్, డీజీల్ పై సెస్సుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రం 89,967 కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. పెద్దనోట్లు రద్దు చేసి జన్ ధన్ ఖాతాలో వేస్తనన్న డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం అదాని ఆస్తి పెంచితే.. సీఎం కేసీఆర్ ప్రజల ఆస్తిని పెంచారన్నారు. రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్టు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆకలి కేకలు లేకుండా చేశామని వివరించారు. నాడు అట్టడగులో ఉన్న తెలంగాణ నేడు దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఏది అడిగినా ఇవ్వకుండా రాష్టానికి బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా 24 గంటలు తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?