Revanth Reddy: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లాగే ఇదీ గూడుపుఠాణీ.. రూ.లక్ష కోట్ల విలువైన ORRను కొల్లగొడుతున్న రేవంత్‌ రెడ్డి

ORR టెండర్ల విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. IRB సంస్థకు ఇచ్చిన లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ ప్రకారం 30 రోజుల్లో 25 శాతం నిధులు చెల్లించారా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లా ఇదీ గూడు పుఠాణీ అన్నప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని బీజేపీ నేతలను నిలదీశారు రేవంత్‌.

Revanth Reddy: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లాగే ఇదీ గూడుపుఠాణీ.. రూ.లక్ష కోట్ల విలువైన ORRను కొల్లగొడుతున్న రేవంత్‌ రెడ్డి
Revanth Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: May 26, 2023 | 6:55 PM

ఓఆర్ఆర్ టోల్ స్కాం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్దదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రూ. లక్ష కోట్ల ఆస్తిని కేవలం రూ.7 వేల కోట్లకు కట్టబెట్టారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. 30 రోజుల్లో 25 శాతం నిధులు చెల్లించాలని కన్సెషన్ అగ్రిమెంట్లో ఉందన్నారు. అయితే, కన్సెషన్ అగ్రిమెంట్ నిజమా కాదా తేల్చాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యిరెట్లు పెద్దదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ. 7వేల కోట్లకు తెగనమ్మారు. ఓఆర్ఆర్ కేటీఆర్ ధన దాహానికి బలైంది. ఇందులో కేసీఆర్, కేటీఆర్ లబ్దిదారులైతే.. సూత్రాధారులు, పాత్రధారులు సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి శుక్రవారం గాంధీభవన్ లో మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు. ఓఆర్ఆర్ టోల్ స్కామ్ పై కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎందుకు విచారణ జరిపించట్లేదని నిలదీశారు. గతంలో ఇదే అంశంపై..టెండర్ దక్కిన సంస్థకు అనుకూలంగా నిబంధనలు మార్చడం, బేస్ ప్రైస్ లేకుండా టెండర్లను పిలవడం, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగుస్తుంది ఈ నేపథ్యంలో 30 ఏళ్లకు లీజుకు ఇస్తే సమస్యలు వస్తాయి కాబట్టి అంత సుదీర్ఘ కాలం కాకుండా టెండర్ వ్యవధి ఉండాలని, అంతేకాకుండా దేశంలో ఏ రహదారి టెడంర్ అయిన 15 – 20 ఏళ్లకు మించి ఇవ్వలేదు అని ఎన్ హెచ్ఏఐ సూచించిన పట్టించుకోకుండా టెండర్ ప్రక్రియను చేపట్టిన విధానాన్ని ప్రస్తావించాను.

తనకున్న సమాచారం మేరకు టెండర్ దక్కించుకున్న సంస్థ టెండర్ మొత్తం విలువలో 10 శాతాన్ని 30 రోజుల్లోగా, మిగతా 90 శాతాన్ని 120 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి నిబంధనలు లేవని బీఆరెస్ ఎమ్మెల్యేలు నిన్న మీడియా సమావేశంలో బుకాయించారు. కానీ డబ్బు చెల్లింపుకు సంబంధించి కన్సెషన్ అగ్రిమెంట్ లో స్పష్టంగా ఈ నిబంధనలు ఉన్నాయి. అగ్రిమెంట్‌లోని 20, 21 పేజీలో మేం చెప్పిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. తాను చెప్పింది 10 శాతమే.. కానీ వాస్తవంగా 30 రోజుల్లో 25 శాతం టెండర్ పొందిన సంస్థ చెల్లించాలి. మిగతా 75 శాతాన్ని 120 రోజుల్లో చెల్లించాలి. ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చి ఉంటే.. ఆ మార్చిన నిబంధనలు ఏంటో బయటపెట్టాలి. ఈ రోజు నేను బయట పెట్టిన కన్సెషన్ అగ్రిమెంట్ నిజమా కాదా చెప్పాల్సిన బాధ్యత అరవింద్ కుమార్, సోమేశ్ కుమార్ పై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఓఆర్ఆర్ టెండర్ కు సంబంధించి ఏప్రిల్ 27, 2023 లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ రోజుతో 30 రోజుల గడువు ముగిసింది. అయితే రూ.7,300 కోట్లలో 25 శాతం అంటే రూ.1800 కోట్లు ప్రభుత్వానికి IRB సంస్థ చెల్లించాల్సి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు ఐఆర్బీ సంస్థ డబ్బులు చెల్లించిందో లేదో తెలియదు. ఒక వేళ చెల్లించకుంటే నిబంధనలు ఉల్లంఘించినందుకు IRB సంస్థ టెండర్ ను రద్దు చేయాలి అని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేటీఆర్ స్పందించాలి..ఆయన విదేశీ పర్యటనలో బీజీగా ఉంటే అరవింద్ కుమార్ స్పందించాలి. దీనిపై పూర్తి బాధ్యత అరవింద్ కుమార్ పై ఉంది. ఇందుతో ఏమీ తేడా జరిగిన అరవింద్ కుమార్ ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

అయితే ఓఆర్ఆర్ టెండర్ల విషయం లక్ష కోట్లకు సంబంధించినదని.. అంత విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ పేర్కొన్నారు. అయితే ఇంత బహిరంగంగానే దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు నిర్వహించడంలేదని నిలదీశారు. మరీ కేంద్ర మంత్రి హోదాలో ఉండి విచారణకు ఆదేశమివ్వని కిషన్ రెడ్డి ఎందుకు కోరడం లేదు దీని వెనక గూడుపుఠానీ ఏంటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రఘునందన్ ఓఆర్ఆర్ టెండర్ పై సీబీఐ కి పిర్యాదు చేశారు. సొంత ఎమ్మెల్యే ఫిర్యాదును బండి సంజయ, కిషన్ రెడ్డి నమ్ముతున్నారా లేదా స్పష్టం చేయాలి. అని రేవంత్ రెడ్డి అన్నారు. ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారాన్ని అంత తొందరగా వదిలిపెట్టబోమని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..