Renuka Chowdhury: ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఢిష్యుం ఢిష్యుం..

Congress Protest: కాంగ్రెస్ ఆందోళనపై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో డీసీపీ జోయల్ డేవిస్‌ చొక్కా పట్టుకున్నారు భట్టి. ఇక మరోచోట ఎస్‌.ఐ. కాలర్‌ పట్టుకున్నారు రేణుకా చౌదరి.

Renuka Chowdhury: ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఢిష్యుం ఢిష్యుం..
Renuka Chowdhury

Updated on: Jun 16, 2022 | 1:43 PM

కాంగ్రెస్‌ ఈడీ విచారణకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనలు చేపట్టాయి కాంగ్రెస్‌ శ్రేణులు. అన్ని రాష్ట్రాల్లో రాజ్‌భవన్‌ను ముట్టడించారు. చండీఘడ్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల రాజ్‌భవన్‌ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్‌ ఈడీ విచారణ పేరుతో కాంగ్రెస్‌ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌ దగ్గర విధ్వంసానికి దిగారు కొందరు కార్యకర్తలు. ఖైరతాబాద్‌ జంక్షన్‌లో బైక్‌ను యాక్టివాను తగలబెట్టారు. అక్కడే ఆర్టీసీ బస్‌పై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా అక్కడే ఉన్నారు. ఖైరతాబాద్‌ జంక్షన్‌లో రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు బైటాయించారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లారు.

ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి

రాజ్‌భవన్‌ ముట్టడిలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రేణుకాచౌదరి రెచ్చిపోయారు. పోలీసుల్ని తిడుతూ, ఎస్‌ఐ కాలర్‌ పట్టుకుని ఫైర్‌ బ్రాండ్‌ అంటే ఏంటో చూపించారు. రాజ్‌భవన్‌ ముట్టడికి వచ్చిన రేణుకాను ముందే ఆపేశారు పోలీసులు. అయితే వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు రేణుక. పోలీసులతో గొడవ పడుతూనే పంజాగుట్ట ఎస్‌ఐ ఉపేంద్ర కాలర్‌ పట్టుకున్నారు రేణుకాచౌదరి. నన్నే అడ్డుకుంటారా అని నిలదీశారు. మహిళా కానిస్టేబుళ్లను కూడా వదల్లేదు రేణుకాచౌదరి. వారిని తోసేసి కొట్టారు. నన్నే పట్టుకుంటారా అంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

డీసీపీ చొక్కా పట్టుకున్న బట్టి విక్రమార్క

కాంగ్రెస్‌ ఆందోళనపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకున్న భట్టి విక్రమార్క, ఎస్‌ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం.

రేవంత్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో కాంగ్రెస్‌ చేపట్టిన చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తంగా మారింది. ఖైరతాబాద్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు తెలిపారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్‌భవన్‌కు వెళ్ళకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు.

తెలంగాణ కాంగ్రెస్‌ రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. వివిధ మార్గాల ద్వారా రాజ్‌భవన్‌కు వచ్చిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు,జగ్గారెడ్డి, రేణుకా చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణ వార్తల కోసం