No Confidence Motion: మున్సిపల్‌ ఛైర్మన్‌‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. ఊడిన బీఆర్‌ఎస్‌ ఛైర్మన్‌ పదవి

నల్లగొండ మున్సిపాలిటీని హస్తం పార్టీ కైవసం చేసుకోనుంది. బీఆర్ఎస్ చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానం నెగ్గింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన 9 మంది కౌన్సిలర్లు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరిన మరో ఆరుగురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టి తీర్మానం నెగ్గింది.

No Confidence Motion: మున్సిపల్‌ ఛైర్మన్‌‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. ఊడిన బీఆర్‌ఎస్‌ ఛైర్మన్‌ పదవి
Nalgonda Municipality

Edited By:

Updated on: Jan 08, 2024 | 4:33 PM

నల్లగొండ మున్సిపాలిటీని హస్తం పార్టీ కైవసం చేసుకోనుంది. బీఆర్ఎస్ చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానం నెగ్గింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన 9 మంది కౌన్సిలర్లు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరిన మరో ఆరుగురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టి తీర్మానం నెగ్గింది. దీంతో కాంగ్రెస్‌ కౌన్సిలర్లలో ఒకరిని ఛైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల చేరికతో పెరిగిన కాంగ్రెస్‌ బలం

జిల్లా కేంద్రమైన నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో ఉత్కంఠగా అవిశ్వాస తీర్మానం కొనసాగింది. మున్సిపల్ కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హేమంత్ కేశవ్ పటేల్ సమక్షంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 41 ఓట్లు, వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌కు ఐదు ఓట్లు వచ్చాయి. ఒకరు తటస్థంగా ఉండగా, మిగిలిన సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండలో మొత్తం 48 వార్డులకు గాను 20 వార్డులు కాంగ్రెస్, 20 వార్డులు బీఆర్ఎస్ , 6 వార్డులు బీజేపీ, ఒక్కొక్కటి ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాలు

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు తమకు లభించిన అవకాశాన్ని వినియోగించుకుని నల్గొండ మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మందడి సైదిరెడ్డి ఎన్నికయ్యారు. మూడు నెలల క్రితం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌ సహా 12 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు.

15 మంది కౌన్సిలర్లకు పదవీ గండం

మరోవైపు నల్లగొండ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందడంతో మున్సిపాలిటీలో రాజకీయాలు అవిశ్వాస తీర్మానం వైపు మళ్లాయి. మున్సిపాలిటిలో కౌన్సిలర్ల చేరికలు ఎక్కువ కావడంతో కాంగ్రెస్‌ బలం 34కు చేరింది. వీరంతా కలిసి చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించారు. ఎక్స్‌ అఫీషియో ఓటు వినియోగించకుండానే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే బీఆర్‌ఎస్‌ విప్‌ జారీ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి గెలిచిన 15 మంది కౌన్సిలర్లకు పదవీ గండం ఏర్పడనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…