AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: 100 ఎకరాల్లో ఖమ్మంలో జనగర్జన సభ.. కాంగ్రెస్ బిగ్ ప్లాన్ ఇదే..

ఖమ్మం సభతో సత్తా చాటేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్. ఈ సభను నాయకులు ప్రస్టేజ్‌ కింద తీసుకున్నారు. జనాల్లో వేవ్ మరింత పెంచేందుకు డిసైడయ్యారు. అటు భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ సభలో ఆయన్ను రాహుల్ ఘనంగా సత్కరించనున్నారు.

Telangana Congress: 100 ఎకరాల్లో ఖమ్మంలో జనగర్జన సభ.. కాంగ్రెస్ బిగ్ ప్లాన్ ఇదే..
Khammam Congress
Ram Naramaneni
|

Updated on: Jun 30, 2023 | 7:44 PM

Share

తెలంగాణలో కాంగ్రెష్ జోష్ కొనసాగుతుంది. అటు బీజేపీని అంతర్గత కలహాలు వెంటాడుతుండగా.. ఇటు కాంగ్రెస్‌లో నేతలు చేరికలు పార్టీకి కొత్త బూస్ట్ ఇస్తున్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు స్టేజ్‌కు వచ్చింది. జూలై 2న జరగనున్న పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. ఈ సభలోనే పొంగులేటితో పాటు ఇతర నాయకుల చేరిక ఉండనుంది. ఈ సభలో 103 రోజులపాటు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి… విభిన్న వర్గాల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగి.. పార్టీకి ఉత్తేజాన్ని తెచ్చిన భట్టిని రాహుల్ సత్కరించనున్నారు. సౌమ్యుడు, వివాద రహితుడిగా భట్టికి పేరుంది. అటు హైకమాండ్ వద్ద కూడా ఆయనకు మంచి గుడ్ విల్ ఉంది. అందుకే పాదయాత్ర కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే గ్రీన్ సిగ్నల్ లభించింది.  ఖమ్మంలో జన గర్జన సభను ఎన్నికల శంఖారావంగా కాంగ్రెస్ చెబుతోంది. అందుకు తగ్గట్లుగానే భారీగా జన సమీకరణ చేస్తుంది. 100 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని అంచనా.

ఈ సభతో ఖమ్మం జిల్లాతో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ సభలో తెలంగాణకు సంబంధించి రాహుల్ పలు హామీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ ఇంచార్జ్ ఠాక్రే ఇక్కడే  మకాం వేసి.. సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అటు రాహుల్ జోడో యాత్ర తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. ఆపై కర్నాటక విజయం, భట్టి పాదయాత్ర.. పార్టీకి, కేడర్‌కు మరింత ఉత్సహాన్ని ఇచ్చాయి.  అన్ని నియోజకవర్గాల్లో తిరిగి.. క్షేత్రస్థాయిలో పర్యటించిన భట్టికి ఈసారి టిక్కెట్ల కేటాయింపు సమయంలో పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

కాగా భట్టి విక్రమార్కతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీ అయ్యారు. జూలై 2న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభపై చర్చించారు. జన గర్జన సభ విజయవంతం చేసేందుకుగాను అవలంభించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు రేవంత్ రెడ్డి.   భట్టి పాదయాత్ర కాంగ్రెస్‌కే కాదు.. యావత్ తెలంగాణకు మేలు చేస్తుందన్నారు రేవంత్‌ రెడ్డి. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భట్టి యాత్ర సాగిందన్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫీడ్ బ్యాక్ ఆధారంగా… ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న జనగర్జన సభ నుంచే తెలంగాణ ప్రజలకు రాహుల్‌ సందేశం ఇవ్వబోతున్నారని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..