MLA Seethakka: రేవంత్ రెడ్డి కోసం సీతక్క మొక్కులు.. మేడారంలో సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మేడారంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ (PCC) అధ్యక్షునిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నియామకంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆనందం వ్యక్తం చేశారు.

MLA Seethakka: రేవంత్ రెడ్డి కోసం సీతక్క మొక్కులు.. మేడారంలో సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు
Mla Seethakka Special Pujas

Updated on: Jun 29, 2021 | 5:46 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మేడారంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ (PCC) అధ్యక్షునిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నియామకంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కలిసి పనిచేస్తామన్నారు. ఈమేరకు సీతక్క మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున వాహనాలతో ర్యాలీగా వెళ్లిన ఎమ్మల్యే సీతక్క వన దేవతలను దర్శించుకొన్నారు.

ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో అమ్మవారిని దర్శించుకున్న వీడియోను పోస్టు చేశారు. తన బ్రదర్ రేవంత్ రెడ్డి ప్రజల కోరిక మేరకు పీసీసీ చీఫ్‌గా నియామకం అయ్యారన్నారు. ఈ సందర్బంగా మేడారంలో తాను మొక్కుకున్న మొక్కును తీరుస్తున్నానని ట్వీట్ చేశారు.

 

 

ఇవి కూడా చదవండి:  Darbhanga Blast: దర్బంగా పేలుళ్ల వెనుక హైదరాబాదీలు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి NIA

Viral Video: చిన్నారిని నవ్వించేందుకు కుక్క కుప్పిగంతలు.. ఈ వీడియో చూస్తే.. అస్సలు నవ్వాపుకోలేరు..