Congress – Jaggareddy: వారికి వర్తించదా క్రమశిక్షణ?.. చిన్నారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జగ్గారెడ్డి..

|

Dec 31, 2021 | 8:49 PM

Congress - Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ,

Congress - Jaggareddy: వారికి వర్తించదా క్రమశిక్షణ?.. చిన్నారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జగ్గారెడ్డి..
Follow us on

Congress – Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తాను రాసిన లేఖపై మీడియా ముఖంగానే వివరణ ఇచ్చానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు తెలియదన్నారు. ఇది మీడియాలో కూడా వచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం నాడు జగ్గారెడ్డి లేఖ అంశంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగా తీర్మానించారు. ఆయనతో మాట్లాడాలని నిర్ణయించారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని చిన్నారెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి స్పందించారు. ఇదే అంశంలో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. తాను రాసిన లేఖపై ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. లేదంటే మీడియాలో వచ్చిన వార్తలను చూసి సుమోటోగా కంప్లైంట్ తీసుకున్నారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళి పెద్దపల్లి అభ్యర్థిని అధిష్టానానికి, పార్టీలో చర్చించకుండా పార్టీ లైన్ దాటి డిక్లేర్ చేస్తే పీసీసీపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ‘‘నేను వరంగల్ పార్లమెంట్ ఇంచార్జిని, భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఈ రోజు వార్తలో చూశానని, దాని గురించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరి అది క్రమశిక్షణ కిందకు రదా..?’’ జగ్గారెడ్డి నిలదీశారు. క్రమశిక్షణ పాటించని పీసీసీ ని క్రమశిక్షణలో తీసుకోవాలని చిన్నారెడ్డి కి తెలియదా? అంటూ ఫైర్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీ ముందు ఫస్ట్ రేవంత్ రెడ్డిని పిలిచి తర్వాత తనను పిలవాలని అన్నారు. అప్పుడు తప్పకుండా వస్తానని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కాబట్టే తాను కూడా మీడియా ద్వారానే జవాబు ఇస్తున్నానని జగ్గారెడ్డి వ్యాఖ్యానినంచారు.

Also read:

Metro Station: అధికారుల వినూత్న ప్రయత్నం.. మెట్లే ఎక్కుతామంటున్న ప్రయాణికులు.. ఎందుకో ఓ లుక్కేయండి..!

NEET PG Counselling: మెడికోలకు గుడ్‌న్యూస్.. నీట్ పీజీ కౌన్సెలింగ్ జనవరి 6 లోపు జరుగొచ్చు..

సీరియల్‌కి అయినా ముగింపు ఉంటుందేమో గానీ.. ఆ రోడ్డుకు మాత్రం శుభం కార్డు పడేలా లేదు..!