Jaggareddy: అంత ఈజీగా వదలే ప్రసక్తే లేదు.. షర్మిలపై సెన్షేషనల్ కామెంట్స్ చేసిన జగ్గారెడ్డి..

|

Dec 02, 2022 | 10:02 PM

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం నాడు షర్మిల అనవసరంగా..

Jaggareddy: అంత ఈజీగా వదలే ప్రసక్తే లేదు.. షర్మిలపై సెన్షేషనల్ కామెంట్స్ చేసిన జగ్గారెడ్డి..
Mla Jagga Reddy
Follow us on

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం నాడు షర్మిల అనవసరంగా నోరు జారిందని, ఆమెను అంత ఈజీగా వదిలిపెట్టనని అన్నారు. ‘కడిగేస్తా.. ఎలా కడుగుతానో చూడండి’ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘ఏపీలో సమస్యలు లేవా? అక్కడ ఆమె అన్నే కదా సీఎం. ప్రజలు గురించి ఆమె ఒక్కరే మాట్లాడుతున్నట్లు బిల్డప్ ఇస్తుంది. ఆమె వెనుక పదిమంది లేరు. ఏం చేస్తుంది.’ అంటూ ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.

‘షర్మిల ఎప్పటికీ రాయలసీమ వారసురాలే. తెలంగాణకు కోడలు మాత్రమే. బ్రదర్ అనిల్ నుంచి, షర్మిల సొంత వ్యవహారాల దాకా అన్ని విషయాలను బయటపెడతా. షర్మిల ఎవరు వదిలిన బాణం అనే చర్చ అయిపోయింది. షర్మిల వల్ల రాజకీయ యుద్ధం వచ్చింది. సెటిలర్లను డిస్ట్రబ్ చేసింది. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా వీళ్ల పంచాయితీ ఎందుకు? హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రోళ్లంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. షర్మిల వచ్చి వారి సంతోషాన్ని, ప్రశాంత వాతావరణాన్ని పాడు చేస్తుంది. షర్మిల తెలంగాణ కోడలు అని చెప్పుకున్నా.. కోడలు కోడలే.. కూతురు కూతురే. విజన్ ఉన్న చంద్రబాబే తెలంగాణ వదిలేసి పారిపోయారు. షర్మిలతో ప్రాంతీయ వాదం తెరమీదకు తెచ్చినట్లయ్యింది. షర్మిల బీజేపీ వదిలిన బాణం అయినా.. అది ఎవరికి తగులుతుంది అనేది తెలియదు.’ అని తీవ్రమైన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్.

ఉద్యోగాల భర్తీపై కీలక కామెంట్స్..

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైందని, ఆ ప్రక్రియ సాఫీగా జరగాలని అన్నారు జగ్గారెడ్డి. రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పారు. టీచర్ పోస్టులు ఎక్కువ ఖాళీగా ఉన్నాయని, టీచర్ పోస్టుల సంఖ్య మరిన్ని పెంచాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. 32 వేల టీచర్ పోస్టులు త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ కూడా రాస్తున్నానని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 10 వేల మందికి ప్రమోషన్స్ ఆగిపోయాయని అన్నారు. ప్రమోషన్స్ ఇస్తే పోస్టుల ఖాళీలు ఏర్పడతాయన్నారు. సీఎం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..