Telangana: తెలంగాణను ‘హస్త’గతం చేసుకునేందుకు పదునైన వ్యూహంతో ముందుకు….

ప్రజంట్ కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ తెలంగాణపై ఉంది. ఇప్పటికే సౌత్‌లో కర్నాటకను హస్తగతం చేసుకున్న పెద్దలు.. ప్రజంట్ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. కర్నాటకలో విజయం ఇచ్చిన సరికొత్త మంత్రాన్ని ఇక్కడ సైతం జపిస్తున్నారు.

Telangana: తెలంగాణను హస్తగతం చేసుకునేందుకు పదునైన వ్యూహంతో ముందుకు....
Rahul Gandhi

Updated on: Jul 05, 2023 | 11:01 AM

తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెంచింది. గత 2 నెలల వ్యవధిలో పార్టీ గ్రాఫ్ ఊహించని విధంగా పెరిగింది. రాహుల్ జోడో యాత్ర… రేవంత్, భట్టి పాదయాత్రలు.. పొంగులేటి వంటి నేతల చేరికలతో జోష్ కొనసాగుతుంది. ఇటీవల ఖమ్మంలో రాహుల్ బహిరంగ సభతో… కేడర్‌కు మరింత ఉత్సాహం వచ్చింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ను బీజేపీ బీ అని ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు రాహుల్. అంతేకాదు.. ప్రతి ఫ్యామిలీకి దగ్గరయ్యేలా.. చేయూత పథకం కింద 4000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు.. ఆదివాసీల గురించి ఎక్కువగా ప్రస్తావించడమే కాకుండా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి పోడు భూములు ఇచ్చేస్తామని ప్రకటించారు.

BRS మొదట్నుంచి అందిస్తున్న పింఛన్ మొత్తం గురించి జనంలోకి గట్టిగా తీసుకెళ్తుంది. ఇప్పుడు రాహుల్‌తో ఏకంగా 4000 పెన్షన్ హామి ఇప్పించింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో ఒక రకంగా అధికార BRS‌ను డిఫెన్స్‌లోని నెట్టినట్లు అయ్యింది. ముఖ్యంగా కర్నాటక విజయంలో కీలక పాత్ర పోషించిన హామీలను రివ్యూ చేసి.. ఇక్కడ కూడా ఆ తరహా అస్త్రాలతో ముందుకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే పెన్షన్ పెంపును ముందుకు తీసుకువచ్చారు. గతంలో 75 ఉన్న పెన్షన్‌ను.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే 200కు పెంచినట్లు కూడా గట్టిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.

వరంగల్‌లో రైతు డిక్లరేషన్,  హైదరాబాద్‌లో యువజన డిక్లరేషన్‌ను ప్రకటించింది  తెలంగాణలో కాంగ్రెస్. తాజాగా రాహుల్ గాంధీ వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.4,000 పెన్షన్ గ్యారంటీగా ఇస్తామని హామి ఇచ్చారు. ఇలా కర్టాటక తరహా మోడల్‌తో ఓట్లు సాధించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. ప్రస్తుతం ఉన్న ఊపు మున్ముందు కొనసాగుతుందా..? ఎన్నికల వేళ.. నేతలంతా ఒక్కతాటి పైన ఉంటారా..? రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్‌ను దెబ్బకొట్టేందుకు.. కాంగ్రెస్ వార్ రూమ్‌లో సరిపడినన్ని అస్త్రాలు ఉన్నాయా..? లెట్స్ వెయిట్ అండ్ సీ…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..