Telangana Congress: స్పీడు పెంచిన తెలంగాణ కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. కీలక భేటీ..

|

Sep 03, 2023 | 3:46 PM

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ స్పీడు పెంచింది. అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం గాంధీభవన్ వేదికగా జరగనుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది.

Telangana Congress: స్పీడు పెంచిన తెలంగాణ కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. కీలక భేటీ..
Telangana Congress
Follow us on

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ స్పీడు పెంచింది. అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం గాంధీభవన్ వేదికగా జరగనుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది. ఇప్పటికే ఆశావహుల నుంచి అర్జీలు స్వీకరించిన పీసీసీ.. వాటిని పరిశీలించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 1006 దరఖాస్తులు వచ్చాయ్. నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని ఫైనల్ చేసి.. వాటినుంచి తుది అభ్యర్థులను పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ రోజు జరిగే ఎలక్షన్ కమిటీ భేటీలో ఈనెల 18 నుంచి 25 వరకు వచ్చిన 1006 దరఖాస్తులపై చర్చించనున్నారు. దరఖాస్తులు ఆహ్వానించిన తర్వాత మొదటిసారి సమావేశం అవుతోంది. నియోజకవర్గాల వారీగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో.. పూర్తి జాబితాను రెడీ చేయనుంది. ముందుగా నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను వేరు చేస్తారు. ఆ తర్వాత రిజర్వేషన్ కేటగిరీ నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను.. రిజర్వేషన్ కానీ జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన వాటిని వేర్వేరుగా పరిశీలించనున్నారు. అలాగే బీసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను కూడా నియోజకవర్గాల వారీగా వేరు చేసి కమిటీ క్షణ్ణంగా పరిశీలించనుంది.

ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విధివిధానాలను ఎలక్షన్ కమిటీ సమావేశంలో సభ్యులంతా చర్చించనున్నారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిటీ మరోసారి సమావేశమై జాబితాను షార్ట్ లిస్టు చేయనుంది. అనంతరం ఈ లిస్టును స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది. ఎలక్షన్ కమిటీ నుంచి ఎంపిక చేసిన జాబితాపై పార్టీ సర్వే కూడా పూర్తి చేసి.. స్క్రీనింగ్ కమిటీకి అందజేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీకి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బలం ఎంత..? అభ్యర్థితో పార్టీకి కలిసి వచ్చే అదనపు అంశాలు.. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది.. తదితర అంశాలపై కాంగ్రెస్ సర్వే చేయనుంది. ఆ తర్వాత సర్వే నివేదికలతో పాటు ఎలక్షన్ కమిటీ రూపొందించిన జాబితాను ఎలక్షన్ కమిటీ స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తుంది. ఈ భేటీ పూర్తయిన అనంతరం స్క్రీనింగ్ కమిటీ త్వరలనే హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ కమిటీ జిల్లాల వారీగా పర్యటనలు చేసి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్ నెలాఖరులోపు ప్రకటించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ మూడో వారంలో 30 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. పార్టీలోని అంతర్గత పోరు, తదితర అంశాలపై కూడా మట్లాడనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..