
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ తుది జాబితా విడుదలైంది. శుక్రవారం (నవంబర్ 10) నామినేషన్లకు గడువు ముగియనుండడంతో పెండింగ్‌లో ఉన్న స్థానాలకు సంబంధించి గురువారం (నవంబర్ 19) రాత్రి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. పటాన్‌చెరు నుంచి టికెట్ ఆశించిన నీలం మధుకి నో చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్. ఆయన స్థానంలో కాటా శ్రీనివాస్‌గౌడ్‌నే బరిలోకి దింపుతోంది. ఇక తుంగతుర్తి నుంచి రేపు నామినేషన్ వేస్తానన్న అద్దంకి దయాకర్ కు కూడా మొండి చెయ్యే చూపించింది కాంగ్రెస్. అక్కడ శామ్యూల్‌ను రంగంలోకి దింపుతోంది. ఇక సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. పటేల్ రమేష్‌రెడ్డిని కాదని.. దామోదర్‌రెడ్డికే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్.
The Central Election Committee has selected the following persons as Congress candidates for the ensuing elections to Telangana Assembly. pic.twitter.com/USKv6QCCs6
— Telangana Congress (@INCTelangana) November 9, 2023
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మొదటి జాబితాను 55 మంది అభ్యర్థులతో ప్రకటించింది. ఆ తర్వాత రెండో జాబితాను 45 మంది అభ్యర్థులతో విడుదల చేసింది. 16మంది అభ్యర్థులతో మూడో జాబితాను రిలీజ్ చేశారు. తాజాగా పటాన్ చెరు అభ్యర్థి పేరు మార్చి మొత్తం ఐదుగురి అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. దీంతో మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్.
ఘనంగా సనత్ నగర్ కాంగ్రెస్ విజయభేరీ!
భారీ జన ప్రభంజనం మధ్యన జరిగి సభలో పిసిసి అధ్యక్షులు శ్రీ @revanth_anumula గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ 6 గ్యారెంటీల వల్ల
సనత్ నగర్ ప్రజలకు అనేక లాభాల ఉంటాయి & అభ్యర్ధి @KotaNeelima గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. #VijaybheriSanathnagar pic.twitter.com/J5Jv9NbwZp— Telangana Congress (@INCTelangana) November 9, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…