Traffic Rules: వాహనదారులకు అలెర్ట్.. ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా ఎంతంటే..

|

Nov 22, 2022 | 7:17 AM

ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు పాల్పడితే.. రాంగ్ డ్రైవింగ్‌కు రూ.1, 700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1, 200 జరిమానా విధించాలని ఆయన ఉత్తర్వులను జారీ చేశారు. ఇంకా సమీక్షలో..

Traffic Rules: వాహనదారులకు అలెర్ట్.. ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా ఎంతంటే..
Traffic Police
Follow us on

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియమాలు కొత్తవేం కాకపోయినా వాటిని మరింత కఠినంగా అమలుచేయాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు నిర్ణయించారు. అప్పుడే వాహన వినియోగదారుల ప్రవర్తనలో మార్పు వస్తుందని, తద్వారా నగర రహదారులు అందరికీ సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతాయని వారు   అభిప్రాయపడుతున్నారు. సోమవారం రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌కు సంబంధించిన పలు సమస్యలను అధికారులతో సమీక్షించిన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎవి రంగనాథ్ ఈ నిర్ణయానికి వచ్చారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు వ్యతిరేకంగా ట్రాఫిక్ అథారిటీ తన కొత్త డ్రైవ్‌ను కూడా సోమవారం నుంచి ప్రారంభించనుంది.

ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు పాల్పడితే.. రాంగ్ డ్రైవింగ్‌కు రూ.1, 700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1, 200 జరిమానా విధించాలని ఆయన ఉత్తర్వులను జారీ చేశారు. ఇంకా సమీక్షలో భాగంగా కమ్యూనికేషన్‌, ఇంజినీరింగ్‌, ఈ-చలాన్‌, వాహనాల ఓవర్‌లోడింగ్‌ వంటి సమస్యల పరిష్కారానికి ప్రామాణిక విధానాలను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నవంబర్ 28 నుంచి ట్రాఫిక్ నియమాలు కఠినంగా అమలవుతాయని ఆయన తెలిపారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా జరిగే ప్రాంతాల ఆధారంగా జరిమానా విధిస్తామని, రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు ప్రధాన కారణమైన యు-టర్న్‌లను సమీక్షించి తగిన సవరణలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ జరిమానా ప్రభుత్వానికి సులువైన ఆదాయ మార్గం అనే సోషల్ మీడియా గాసిప్ అబద్ధమని.. అది  నిబంధనలను కఠినంగా అమలు చేయడం కొసం, వాహన వినియోగదారులలో ప్రవర్తనా మార్పును ప్రభావితం చేసే వ్యూహం మాత్రమేనని రంగనాథ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..