గంజాయి, మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది.. గంజాయి మూలాలను కూకటి వేళ్ళతో పెకిలిస్తోంది.. అందులో భాగంగానే నార్కోటిక్ అధికారులు ప్రజలను చైతన్య పరుస్తూ చాలా ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ఇంకా ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.. యువత మత్తుకు బానిస కాకుండా ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ ఒక్కసారిగా కలకలం రేపింది.. పోస్టర్‌లో ఫోటో మార్ఫింగ్ చేసి సీఎం రేవంత్ రెడ్డి సిగరెట్ తాగుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారు.. గుర్తు తెలియని దుండగులు… సీఎం సిగరెట్ తాగుతున్న ఫోటో చూసి అక్కడ అధికారులు జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా చేశారు.. అప్పటికప్పుడు అప్రమత్తమైన అధికారులు సీఎం ఫోటోలు తొలగించారు..
ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగింది.. తహసిల్దార్ & జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో నార్కోటిక్ సిబ్బంది మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పోస్టర్ వేశారు.. ఆ పోస్టర్ లో ఫోటో మార్ఫింగ్ చేసిన ఆకతాయిలు ఏకంగా సీఎం సిగరెట్ తాగుతున్నట్లు ఎడిట్ చేశారు..
ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలో అంటించిన పోస్టర్లో ఇలా సీఎం పొగ తాగుతున్నట్లు ఫోటో మార్ఫింగ్ చేయడం కలకలం రేపింది. విషయం తెలిసిన వెంటనే మార్ఫింగ్ చేసిన ఫోటోను అధికారులు తొలగించారు..ఎల్కతుర్తి సిఐ నేతృత్వంలో ప్రత్యేక టీమ్స్ ఆ ఆకతాయిల గురించి గాలిస్తున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..