Revanth Reddy: పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..

పహల్గామ్‌‌లో ఉగ్రదాడి అనంతరం తదితర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ అని.. పేర్కొన్నారు.. పాకిస్తాన్‌తో తాజా యుద్ధం నేపథ్యంలో 50 ఏళ్ల తర్వాత కూడా ఇందిరాగాంధీ వంటి నాయకురాలి అవసరాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు.

Revanth Reddy: పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..
Cm Revanth Reddy

Updated on: May 19, 2025 | 4:03 PM

పహల్గామ్‌‌లో ఉగ్రదాడి అనంతరం తదితర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ అని.. పేర్కొన్నారు.. పాకిస్తాన్‌తో తాజా యుద్ధం నేపథ్యంలో 50 ఏళ్ల తర్వాత కూడా ఇందిరాగాంధీ వంటి నాయకురాలి అవసరాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. ఈ రాజ్యమే ఇందిరమ్మ రాజ్యమంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కొందరు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సోషల్‌ మీడియా ద్వారా విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కానీ నిజాలు ఆలస్యంగా అయినా ప్రజలు తెలుసుకుంటారన్నారు. సన్నబియ్యం తీసుకుంటున్న ఆడబిడ్డలు, ఉద్యోగాలు పొందిన యువత ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారని సీఎం అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు.

కడుపు నిండా విషం పెట్టుకుని రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరు ఎలాంటి విష ప్రచారం చేసినా..ప్రజలే వారికి తగిన బుద్ది చెబుతారంటూ సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రతిఊరులో ఒకరిద్దరు సన్నాసులు ఉన్నంతమాత్రాన ఊరు పాడవుతుందా? అని ప్రశ్నించారు.

నల్లమల అంటే ఒకప్పుడు వెనకబడిన ప్రాంతమని.. పాలమూరు, నల్లమల అంటే తనకు ఎంతో గౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చారు.. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర గతపాలకులది అని సీఎం రేవంత్ అన్నారు.

మహిళలే ఆర్టీసీ బస్‌లు అద్దెకు తిప్పుకునేలా చేశామని.. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా మహిళలు అదానీలతో పోటీపడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. మహిళాసంఘాలను బంక్‌లకు యజమానులను చేశామన్నారు. 2029లోపు కోటిమందిమహిళలు కోటీశ్వరులు కావడమే లక్ష్యమన్నారు.

తొలి ఏడాదిలోనే లక్షా 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. విద్యకు అత్యధిక ప్రాధాన్యతఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ నెంబర్‌వన్‌.. పన్నుల వసూళ్లలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.. పరిపాలనలో కూడా పాలమూరు బిడ్డలు నెంబర్‌వన్‌.. అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..