CM Revanth Reddy: బనకచర్లకు వ్యతిరేకంగా కలిసి పోరాడుదాం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

రాజకీయాలకతీతంగా బనకచర్లపై పార్టీలన్నీ పోరాడాలి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బనకచర్లపై సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో భేటీ అయిన ఆయన ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు మూడు విధాలుగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిసి ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెబుతామన్నారు. కిషన్‌రెడ్డి కూడా తమతో కలిసి రావాలని సీఎం రేవంత్ అన్నారు. నాడు కేసీఆర్, జగన్‌ కలిసి రాయలసీమ గోదావరి నీళ్లు తరలిస్తామన్నారని గుర్తు చేశారు.

CM Revanth Reddy: బనకచర్లకు వ్యతిరేకంగా కలిసి పోరాడుదాం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Revanth Reddy

Updated on: Jun 18, 2025 | 9:13 PM

గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన అఖిలపక్ష ఎంపీల సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి-బనకటర్లపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై విపక్షాలతోనూ చర్చించామని, బనకచర్లపై ఎంపీలు తమ అభిప్రాయాలు తెలిపారని అన్నారు. రాజకీయపరంగా ఎలా ఉన్నా రైతుల విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మా ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. రాజకీయాలకతీతంగా బనకచర్లపై పార్టీలన్నీ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 3 వేల టీఎంసీల అంశం అక్కడి నుంచే మొదలైందని.. నాటి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌ కలిసి రాయలసీమకు గోదావరి నీళ్లు తరలిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బనకచర్లకు అప్పుడే అంకురార్పణ జరిగింది తెలిపారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై 3 రకాలుగా ముందుకు సాగుతున్నామని..ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిసి ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెబుతామన్నారు. కిషన్‌రెడ్డి కూడా తమతో కలిసి రావాలని సీఎం రేవంత్ అన్నారు. ఈ పొలిటికల్ ఫైట్ లో న్యాయం జరగకపోతే లీగల్ ఫైట్ చేద్దామని సీఎం అన్నారు. ఈ విషయంలో నేతలు రాజకీయాలకతీతంగా పొరాలడాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..