CM Revanth: ఓరుగల్లు వాసులకు వరాల జల్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌కు మరిన్ని హంగులు అద్దుతామంటున్నారు. ఇదే సమయంలో ఫిరాయింపుల అంశంపై యుద్ధం నడుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.! అదేంటంటే ఓ సారి లుక్కేయండి.

జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్.. 800కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఘన్‌పూర్‌లో 100 పడకల ఆస్పత్రి, డిగ్రీ కాలేజీతో పాటు, దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-2 పనులకు నిధులు విడుదల చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎయిర్‌పోర్ట్‌ను తానే సాధించానంటున్నారు సీఎం రేవంత్.
హైదరాబాద్‌కు పోటీగా వరంగల్‌ను తయారుచేయాలనేదే ప్రభుత్వం లక్ష్యం. ఓరుగల్లులో ఏమేం పనులు చేయబోతున్నారు. ఎంత ఖర్చవుతుందనేది వివరించారు. రేవంత్ పిలుపుమేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లానంటున్నారు ఎమ్మెల్య కడియం శ్రీహరి. 800కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిందంటే అదే కారణమంటున్నారు. రేపో, ఎల్లుండో జరిగే ఎన్నికలు వస్తాయని కాదు.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంతో పాటు వరంగల్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈ పనులకు శ్రీకారం చుట్టామంటున్నారు సీఎం రేవంత్.