Telangana: రూ.2 లక్షలకు పైబడిన రుణాలపై క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణలో రెండు లక్షల రైతు రుణమాఫీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. రెండు లక్షల పైన రుణాలు ఉన్నవారికి షరతులు వర్తిస్తాయని తేల్చి చెప్పారు. అదే సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుపై విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం రేవంత్‌.

Telangana: రూ.2 లక్షలకు పైబడిన రుణాలపై క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Telangana CM Revanth Reddy

Updated on: Aug 28, 2024 | 7:50 PM

తెలంగాణలో రెండు లక్షల రైతు రుణమాఫీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. రెండు లక్షల పైన రుణాలు ఉన్నవారికి షరతులు వర్తిస్తాయని తేల్చి చెప్పారు. అదే సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుపై విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం రేవంత్‌.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్‌రెడ్డి సర్కార్ రెండు లక్షల రైతు రుణమాఫీ పథకం అమలు చేసింది. మెుత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. అయితే.. రేషన్ కార్డు లేకపోవటం, ఆధార్ కార్డులో తప్పులు, పట్టాదార్ పాస్‌బుక్స్‌లోని పేరుతో సరిగా లేకపోవటం లాంటి కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. అలాగే.. రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. దీనిపైనా ఆయా రైతులు ఆందోళన చెందుతున్నారు. అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదంటూ కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే.. రెండు లక్షలకు పైబడిన రుణాలపై స్పష్టత ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. రెండు లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే రుణమాఫీ వర్తిస్తుందన్నారు. అందరికీ రుణమాఫీ జరుగుతుందని స్పష్టం చేశారు. రైతు రుణాలు మాఫీ కాని వారి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లలో గ్రీవెన్స్ పెట్టామని చెప్పారు. రుణమాఫీ కానివారి లిస్ట్ కలెక్టరేట్‌లో ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు 17వేల 933 కోట్లు జమ చేశామని ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఇక.. మరోవైపు.. కేటీఆర్‌, హరీశ్‌రావుపై విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. రుణమాఫీ విషయంలో హరీష్‌రావు సవాల్ చేసి పారిపోయారని విమర్శించారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చేయకుండా పారిపోయారని ఆరోపించారు. రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్‌ నేతలు లేనిపోని ఆరోపణలు, రైతుల్ని తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తు్న్నారని మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని చెప్తున్న హరీష్‌రావు, కేటీఆర్‌ ప్రతి రైతు దగ్గరకు వెళ్లి.. రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించలన్నారు. వివరాలు సేకరించి కలెక్టరేట్‌లో ఇవ్వాలని హరీష్‌రావు, కేటీఆర్‌ సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..