CM KCR: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు.. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌..

|

Nov 15, 2022 | 5:36 PM

టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ముందస్తు ఎన్నికల అంశంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. ముందస్తు ఎన్నికలు ఉండవని పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్యనేతలకు క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో ఇక యుద్ధమే అంటూ దిశానిర్దేశం చేశారు.

CM KCR: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు.. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌..
CM KCR (File Photo)
Follow us on

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక ప్రకటన చేశారు. మంగళవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదే గడువు ఉండటంతో ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉంటూ పర్యవేక్షించాలని.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీయాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వపరంగా ఉన్న లోటుపాట్లను నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కూడా మనం గెలిచి మరోసారి అధికారం దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి మంత్రి మరో ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. వంద ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని నిమించాలన్నారు. పది రోజుల్లో ఇన్‌ఛార్జుల నియామకం పూర్తి కావాలన్నారు. మూడోసారి అధికారం మనదే.. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం