CM KCR: రెండో విడ‌త గొర్రెల పంపిణీకి రూ. 6 వేల కోట్లు.. BCల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ బాటలు..

|

Jul 20, 2021 | 4:02 PM

తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను  సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5000 కోట్ల రూపాయాలు ఖర్చుతో...

CM KCR: రెండో విడ‌త గొర్రెల పంపిణీకి రూ. 6 వేల కోట్లు.. BCల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ బాటలు..
CM KCR
Follow us on

BCల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన పథకాలు దేశం మొత్తానికి ఆదర్శంగా మారుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో వృత్తి కులాలైన బిసీ వర్గాల అభ్యున్నతి – ప్రభుత్వ కార్యాచరణ – రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనే అంశాల పై ప్రగతి భవన్‌లో మంగళవారం సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని.. కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్ననేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు.

సబ్బండ కులాల జీవనంలో..

నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గాడిన పడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతుందన్నారు. తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని సిఎం కెసిఆర్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సిఎం అన్నారు.

రెండవ విడత గొర్రెల పంపిణీ..

తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను  సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5000 కోట్ల రూపాయాలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీకోసం మరో 6000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు సిఎం తెలిపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను సిఎం ఆదేశించారు.

దాంతో..మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుందన్నారు. అంతేకాకుండా… ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్‌ను అదే సంఖ్యతో కొనసాగించాలని సిఎం స్పష్టం చేశారు. దాంతోపాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సిఎం నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి: Farmers Profit: రైతులకు మరో గుడ్ న్యూస్.. వరిగడ్డిని బంగారంగా మార్చే గోల్డెన్ ప్లాన్..

Viral Video: ఈ కారు చూస్తే షాక్ అవుతారు.. చూసిన తర్వాత.. ఇది మోడల్ అంటూ మీరు కూడా ప్రశ్నిస్తారు..

Fevicol: ఫెవికోల్ సంస్థ పేరు.. కానీ అందులో అతికించే తెల్లని ద్రవ పదార్థాన్ని ఏమని పిలుస్తారో తెలుసా..