CM KCR Phone : ‘నిర్మల్‌లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. అదే లక్ష్యం కావాలి..!’ మంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్

|

Jul 22, 2021 | 7:29 PM

ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల తెలంగాణలోని నిర్మల్ ప‌ట్టణం నీటిమయమైపోయింది. ఎటు చూసినా వాటరే.. ఈ పరిస్థితుల్లో నిర్మల్ పట్టణంలో వ‌ర‌ద ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డితో కొంచెం సేపటి క్రితం..

CM KCR Phone : నిర్మల్‌లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. అదే లక్ష్యం కావాలి..! మంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్
Kcr Phone
Follow us on

Nirmal Rains and Flood water : ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల తెలంగాణలోని నిర్మల్ ప‌ట్టణం నీటిమయమైపోయింది. ఎటు చూసినా వాటరే.. ఈ పరిస్థితుల్లో నిర్మల్ పట్టణంలో వ‌ర‌ద ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డితో కొంచెం సేపటి క్రితం ఫోన్లో మాట్లాడిన సీఎం.. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వర‌ద ముంపునకు గురైన, ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మ‌రో 24 గంట‌ల పాటు నిర్మల్ పట్టణ వ్యాప్తంగా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సూచించారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.

సహాయ‌క చ‌ర్యలు చేప‌ట్టడానికి నిర్మల్‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నామ‌న్నామని కేసీఆర్.. మంత్రికి తెలియజేశారు. నది తీర ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు హై అలర్ట్‌తో ఉండాలని సీఎం ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సహాయ బృందాలు అనునిత్యం రెడీగా ఉండాలని కేసీఆర్ సూచించారు.

Indrakaran Reddy

కాగా, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా మరో మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఇక సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. నది జలాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.

Read also: West Godavari : నాలుగు నెలలైనా చేతికి రాని దాళ్వా డబ్బు.. రోజుల తరబడి వర్షాలు, కొట్టుకుపోయిన నారుమళ్లు