Telangana Secretariat: సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. 6 ఫైళ్లపై సంతకం..

| Edited By: Ravi Kiran

Apr 30, 2023 | 3:13 PM

తెలంగాణ రాజసానికి నిలువుటద్దంలా మెరిసిపోతున్న నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మొదట సచివాలయంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం.. రిబ్బన్ కట్ చేసి తన కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శాంతకుమారి స్వాగతం పలికారు.

ఎలక్ట్రిక్ వెహికల్‌లో తన చాంబర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. సరిగ్గా 1.31 గంటలకు చాంబర్‌లో తన సీటులో కూర్చున్నారు సీఎం కేసీఆర్. తొలి ఫైల్‌పై సంతకం చేశారు. మొత్తం 6 ఫైళ్లపై సంతకం చేశారు సీఎం. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. వారికి పాదాభివందనం చేశారు సీఎం కేసీఆర్. ఆ తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు పాదాభివందనం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..