Telangana: టీచర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. బదిలీలు, ప్రమోషన్లకు పచ్చ జెండా.. మరో రెండు మూడు రోజుల్లోనే..

|

Jan 16, 2023 | 6:22 AM

తెలంగాణ టీచర్స్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి కానుకగా పదోన్నతులు, బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ప్రయోషన్ల వార్తతో హర్షం వ్యక్తం చేశారు ఉపాధ్యాయ సంఘాలు.  తెలంగాణ...

Telangana: టీచర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. బదిలీలు, ప్రమోషన్లకు పచ్చ జెండా.. మరో రెండు మూడు రోజుల్లోనే..
Kcr
Follow us on

తెలంగాణ టీచర్స్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి కానుకగా పదోన్నతులు, బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ప్రయోషన్ల వార్తతో హర్షం వ్యక్తం చేశారు ఉపాధ్యాయ సంఘాలు.  తెలంగాణ విద్యా శాఖలో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు, పదొన్నతలకు మోక్షం కలిగింది. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రమోషన్ల, ట్రాన్స్ఫర్ లు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు షెడ్యూల్‌ విడుదల చేయాలని మంత్రులు సబిత, హరీశ్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో పదోన్నతులు, బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి కానుకగా బదిలీలకు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చార నీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వ అధికారులు తెలియజేశారు.

ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,266 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు.ఫిబ్రవరి 10 నాటికి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. విద్యా సంవత్సరం ముగిసిన తర్వాతే రిలీవ్ అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్​రావు ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యారు. బదిలీలు, ప్రమోషన్ల పై చర్చించి సహకరించాలని కోరారు.

317 జీఓ సమస్యలు, స్పౌజ్ ఇష్యూ పై కూడా చర్చినట్టు తెలుస్తోంది. 317 కాకుండా స్పౌజ్ ఇష్యూ లో సగం క్లియర్ అయ్యేలా చేస్తామని ప్రభుత్వం చెప్పినట్టు సమాచారం. బదిలీలు ప్రమోషన్ల నిర్ణయంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల  కోసం..