Sikkim Accident: సిక్కిం దుర్ఘటనపై సీఎం సంతాపం.. బాధితులను ఆదుకోవాలంటూ కేంద్రాన్ని కోరిన కేసీఆర్‌..

|

Dec 23, 2022 | 9:00 PM

100 అడుగుల ఎత్తు నుంచి వాహనం లోయలో పడిపోవడంతో నుజ్జునుజ్జయింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు ప్రారంభించారు.

Sikkim Accident: సిక్కిం దుర్ఘటనపై సీఎం సంతాపం.. బాధితులను ఆదుకోవాలంటూ కేంద్రాన్ని కోరిన కేసీఆర్‌..
Kcr
Follow us on

భారత ఆర్మీలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. చనిపోయిన వారిలో 13 మంది సైనికులు కాగా, ముగ్గురు ఆర్మీ అధికారులని తెలిసింది. శుక్రవారం ఉదయం భారత్ -చైనా సరిహద్దు సమీపం సిక్కింలోని ఛటెన్ నుంచి తాంగు వైపు వెళ్తున్న కాన్వాయ్‌లో ఓ వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. జెమా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. కాగా, జరిగిన ప్రమాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

మరోవైపు, సిక్కిం ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 16 మంది జవాన్లు మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్మీ జవాన్లు, అధికారుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ తన సానుభూతిని తెలిపారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు తగు విధంగా వైద్యసేవలందించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.

ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో మిలిటరీ ట్రక్కులో 20 మంది ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనం ఓ లోయలో పడిపోయింది. ఓ మలుపు వద్ద వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయినట్టు భావిస్తున్నారు. 100 అడుగుల ఎత్తు నుంచి వాహనం లోయలో పడిపోవడంతో నుజ్జునుజ్జయింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి