Telangana: గద్వాల్ ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు.. ఒక్కో గ్రామానికి రూ. 10 లక్షల చొప్పున,

CM KCR: గద్వాల జిల్లాపై వరాల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్‌. ప్రతి గ్రామానికి 10లక్షలు, మండల కేంద్రానికి 15లక్షలు, గద్వాల మున్సిపాలిటీకి రూ. 50కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ ప్రకటించారు. మిగతా మూడు మున్సిపాలిటీలకు రూ. 25కోట్ల చొప్పున నిధులు ఇవ్వనున్నట్టు ప్రకటన చేశారు.

Telangana: గద్వాల్ ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు.. ఒక్కో గ్రామానికి రూ. 10 లక్షల చొప్పున,
CM KCR

Updated on: Jun 13, 2023 | 5:25 AM

Telangana: మొన్న నాగర్‌కర్నూల్‌, తర్వాత మంచిర్యాల, ఇప్పుడు గద్వాల.. వరుస పర్యటనలతో జిల్లాలను చుట్టేస్తున్నారు సీఎం కేసీఆర్‌. అనధికారికంగా ఎన్నికల శంఖారావం పూరించి దూసుకుపోతున్నారు. ఒకవైపు నూతన కలెక్టరేట్‌ భవనాలు, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభిస్తూ, ఇంకోవైపు బహిరంగసభలతో జనంలోకి వెళ్తున్నారు. గద్వాలలో సమీకృత పరిపాలనా భవనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌… 9ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లాపై వరాల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్‌. ప్రతి గ్రామానికి 10లక్షలు, మండల కేంద్రానికి 15లక్షలు, గద్వాల మున్సిపాలిటీకి రూ. 50కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ ప్రకటించారు. మిగతా మూడు మున్సిపాలిటీలకు రూ. 25కోట్ల చొప్పున నిధులు ఇవ్వనున్నట్టు ప్రకటన చేశారు.

ఇంకా ఒకప్పుడు పాలమూరులో హృదయ విదారక దృశ్యాలు కనిపించేవని, ఇప్పుడా పరిస్థితులు లేవన్నారు. పక్క రాష్ట్రాల నుంచి పాలమూరుకే వలస వచ్చేలా కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి చేసుకున్నామన్నారు. తెలంగాణ ఇస్తే.. చీకటిమయం అవుతుందని ఆనాడు హేళన చేశారని, ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే కరెంట్‌ లేకుండా పోయిందన్నారు కేసీఆర్‌. దేశంలో 24 గంటలు కరెంట్‌ ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ టార్గెట్‌గా మరోసారి ధరణిని ప్రస్తావించారు కేసీఆర్‌. ధరణి వెనుక మూడేళ్ల కష్టం ఉందన్నారు. రైతుల కష్టాలను తీర్చిన ధరణి కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ను కాపాడుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..