
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు తమదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ అభిమానాన్ని చాటుకొంటున్నారు. గురువారం సిద్దిపేటలోని జయశంకర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ కప్ సీజన్-3 టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, సినీ నటుడు నానితో కలిసి మంత్రి హరీశ్‌రావు టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ వేదికపై హీరో నాని నూతన సినిమా దసరా ట్రైలర్‌ను మంత్రి ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీపై ఎల్లప్పుడూ భగవంతుని దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.@TelanganaCMO pic.twitter.com/0RXql8AOG4
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2023
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి.. సీఎం కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రముఖ ఆలయాల్లో పూజలు, హోమాలు నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని ఛాయా సోమేశ్వర ఆలయం లో అర్చక సంఘం ఆధ్వర్యంలో మృత్యుంజయ ఆయుష్షు హోమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ CM కేసీఆర్ బర్త్‌డే వేడుకలతో సోషల్‌మీడియా మోతెక్కిపోతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే.. వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా విషెస్ చెప్పారు. ఇందులో BJP శుభాకాంక్షలు సమ్‌థింగ్ స్పెషల్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో BRS-BJP మధ్య పచ్చగడ్డి కూడా వేయకుండానే భగ్గుమనే పరిస్థితి.
అయితే పాలిటిక్స్‌ను పక్కన పెట్టి కమలనాథులు కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మతోపాటు పలువురు నేతలు కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు.
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
Birthday Greetings to Hon’ble Chief Minister of Telangana Shri K. Chandrashekar Rao Garu. May god bless you with long and healthy life.@TelanganaCMO pic.twitter.com/rSIfwCTCHh
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 17, 2023
బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీలో దివ్యాంగులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని సిరిసిల్లకు చెందిన బీఆర్‌ఎస్ యువనేత సాయివికాస్ గురువారం పాదయాత్ర చేపట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Warm Birthday wishes to Chief Minister of Telangana Sri K Chandrasekhara Rao Garu. May you be blessed with long life and good health.@TelanganaCMO pic.twitter.com/PKgM95eqNk
— N Chandrababu Naidu (@ncbn) February 17, 2023
బ్రెయిలీ లిపిలో సీఎం కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దేశంలో ఎవరి జీవిత చరిత్ర బ్రెయిలీ లిపిలో లేదని, తొలిసారి తెలంగాణ సాధకుడు, సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను ప్రత్యేకంగా అంధుల కోసం రూపొందించటం అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఈ పుస్తకం రావటానికి తోడ్పడిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు.
రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు పల్లీలు, ఉలవలతో సీఎం కేసీఆర్ చిత్రపటం వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో పల్లీలు, ఉలవలు, ఉప్పు, రంగులతో 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ కు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Birthday Wishes to honb @TelanganaCMO
Shri K Chandrasekar Rao garu— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 17, 2023
ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Birthday greetings to Telangana CM Shri KCR Garu. I pray for his long life and good health. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2023
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కీసరలో ప్రత్యేక పూజలు, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. సీఎం పేరు మీద అభిషేకం, ప్రత్యేక పూజల నిర్వహించారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. కీసర అర్బన్ ఎకో పార్క్ లో మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ లు మొక్కలు నాటారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం లో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రియతమ ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అమెరికాలో స్కైడైవర్ సంతోష్ కేసీఆర్‌పై ఇలా గగన వీధుల గుండా తన అభిమానాన్ని చాటుకున్నారు. పారాచూట్ సాయంతో గాలిలో తేలియాడుతూ బర్త్ డే విషెస్ చెప్పారు. బ్రెయిలీ లిపిలో రాసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్రను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలో ఎవరి చరిత్రా బ్రెయిలీ లిపిలో లేదన్నారు. కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ బర్త్‌డే బాణా సంచాతో ఓరుగల్లు దద్దరిల్లింది. కేసీఆర్ 69వ జన్మదినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, తూర్పు ఎమ్మెల్యే నరేందర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అజాంజాహి మిల్లు గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సెట్టింగ్ తో వినూత్న రీతిలో కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు మంత్రులు. తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా నాలుగు రోజుల పాటు జన్మదిన సంబరాలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ చరిత్రను తిరగరాసిన విజేత సీఎం కేసీఆర్ పై వినూత్నంగా కొండంత అభిమానం చాటాడో వీరాభిమాని. సీఎం 69వ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో 18అడుగుల కేసీఆర్ భారీ చిత్రాన్ని 25కిలోల ఆవాలతో అద్భుతంగా చిత్రించాడు అభిమాని రామకోటి రామరాజు. గజ్వేల్ పట్టణంలో ప్రగతి సెంట్రల్ స్కూల్ లో ఏకంగా 5రోజులు శ్రమించి కేసీఆర్ 18 అడుగుల అతి భారీ చిత్రాన్ని 25కిలోల ఆవాలను అత్యంత అద్భుతంగా చిత్రించి ఆవిష్కరించాడు.
తెలంగాణ చరిత్రను తిరగరాసిన విజేత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని, రాజకీయ చరిత్రలో అయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎంఎల్‌సీ, భారత జాగృతి అధ్యక్షులు కవిత అన్నారు. తెలంగాణ సాధనలో తన ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసిన సీఎం కేసీఆర్ అందరికీ స్ఫూర్తి దాత అని కవిత అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారత జాగృతి తరపున ఏర్పాటుచేసిన కేసీఆర్ కప్- 2023 వాలీబాల్ టోర్నమెంట్ ను హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో నిర్వహించారు. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్స్ కు విచ్చేసిన ఎంఎల్‌సీ కవిత అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసారు.
ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.. తన అభిమాన నాయకుడికి కాస్త వెరైటీగా శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. ఇందులో భాగంగానే కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడినా కేసీఆర్ బర్త్ డే వేడుకల కోసం అలాంటి సెట్టింగ్ వేయించారు. అజంజాహి మైదానంలో సుమారు రూ.30 లక్షలు వెచ్చించి ఇలా నూతన సచివాలయ నమూనాతో సెట్టింగ్ ఏర్పాటు చేయించారు. ఇదే సమయంలో శివరాత్రికి ఇక్కడే పూజలు చేసేలా మరో రూ.30 లక్షలతో భారీ శివలింగం, భక్తుల జాగారం కోసం ఏర్పాట్లు చేపట్టారు. ఈ నిర్మాణాన్ని బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి హరీశ్‌రావు, మంత్రి దయాకర్‌రావుతో కలిసి ప్రారంభించనున్నారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పుట్టిన రోజు సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితంలో తనదైన పంథాను కలిగిన కేసీఆర్ కు సంతోషకరమైన జీవితం, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుతున్నట్లు తెలిపారు.
శ్రీ కె.సి.ఆర్. @TelanganaCMO గారికి జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan#HappyBirthdayKCR pic.twitter.com/486vWyqc7L
— JanaSena Party (@JanaSenaParty) February 17, 2023
కేవలం ఇద్దరు ఎంపీలతో పార్లమెంటులో రాజకీయ పోరాటం… నాలుగు కోట్ల మంది తెలంగాణా ప్రజల్ని ఉత్తేజపరుస్తూ సామాజిక చైతన్యం… రెండు మార్గాల్లో ఉద్యమాన్ని నడిపించారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్‌తో కలిసి కేసీఆర్ చూపిన ఫైటింగ్ స్పిరిట్.. దేశం మొత్తాన్నీ ఆకర్షించింది. మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె లాంటి వ్యూహాలతో సోనియా ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చాయి. ఆవిధంగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సాకారం కావడంలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. 2014లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకుని… తాను సాధించుకున్న రాష్ట్రానికి తానే తొలి ముఖ్యమంత్రి అనిపించుకున్నారు కేసీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ పై వినూత్న రీతిలో పారా గ్లయిడర్ పై హ్యాపీ బర్తడే సీఎం మరియు అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో శుబాకాంక్షలు తెలిపిన బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు అరవింద్ అలిశెట్టి.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన నిజాంపేట్ సతీశ్‌రెడ్డి అనే యువకుడు తన కుడి చేతిపై కేసీఆర్ పచ్చబొట్టును వేయించుకొన్నాడు. వృత్తిరీత్యా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న సతీశ్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ అంటే చిన్నప్పటి నుంచి అభిమానమని తెలిపాడు.
ఈ బక్క పలచటోడు ఏం పొడుస్తడు… అనే సూటిపోటి మాటల్ని భరిస్తూనే… నీళ్లు-నిధులు-నియామకాల్లో పాలకుల వివక్షకు వ్యతిరేకంగా.. ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. ఒకవైపు తెలంగాణా సమాజాన్ని చైతన్య పరుస్తూ మరోవైపు రాజకీయ ఎత్తుగడలు వేస్తూ… డ్యూయల్ స్ట్రాటజీతో ముందుకెళ్లారు. 2004లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి, యూపీఏ క్యాబినెట్‌లో చేరి… ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం మళ్లీ కేంద్రంతో కటీఫ్ చెప్పి… బైటికొచ్చేశారు. కరీంనగర్ నుంచి ఒంటరిగా పోటీచేసి 2 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచి… మళ్లీ పార్లమెంటులో అడుగు పెట్టారు.
2009లో ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా… 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష… కేసీఆర్ చచ్చుడో తెలంగాణా వచ్చుడో… ఇదీ నినాదం. దిగొచ్చిన కేంద్రం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్టు విధాన ప్రకటన చేసింది. అదే టైమ్‌లో సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడ్డంతో మళ్లీ పోరాటం తప్పలేదు కేసీఆర్‌కి. మెదక్ ఎంపీగా 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి… పార్లమెంటులో రీఎంట్రీ ఇచ్చారు.
టీడీపీ టు బీఆర్ఎస్ వయా.. టీఆర్ఎస్…! తనకు తానే రెడ్‌కార్పెట్ పరుచుకుని.. తనదైన రాజకీయాన్ని షురూ చేసుకుంటూ వస్తున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఎదిరించి నిలబడే తత్త్వం ఆయన ఎదిగేలా చేసింది… రెవెల్యూషనరీ పొలిటీషియన్‌గా ఆయనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసింది. మెదక్ జిల్లా యూత్‌కాంగ్రెస్ లీడర్‌గా పొలిటికల్ జర్నీ మొదలుపెట్టి… తెలుగుదేశం పార్టీలో చేరి సిద్ధిపేట నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీయార్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. చంద్రబాబు హయాంలో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి… తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. జలదృశ్యంలో కేసీఆర్ సొంత పార్టీ టీఆర్‌ఎస్ పురుడు పోసుకుంది.
ఇవాళే సిక్స్‌టీ నైన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు తెలంగాణా సీఎం కేసీఆర్. గత పుట్టినరోజుతో పోలిస్తే ఆయనకు ఇది వెరీవెరీ స్పెషల్ బర్త్‌డే. ఎందుకంటే… కేసీఆర్ పొలిటికల్ జర్నీ గురించి ఇప్పుడు ఔట్‌సైడ్ ఆఫ్ తెలంగాణా కూడా మాట్లాడుకుంటోంది. ఆయన స్టయిలాఫ్ రాజకీయం… ఇవాళ నేషనల్ లెవల్లో ట్రెండింగ్ టాపిక్కయింది.