Telangana: ఇకపై సర్కారు బడుల్లో టిఫిన్.. నేటి నుంచే ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకం.
నిజానికి తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్.. మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాలలో పథకాన్ని ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. అయితే సీఎం ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. దీంతో ఆర్థిక మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ కోసం మొత్తం....
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారుల్లో తలెత్తే పౌష్టికాహార లోపాని చెక్ పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పేరుతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని శుక్రవారం (నేటి)నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున మొత్తం 119 చోట్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఈ పథకం మెనూలో ఏయే టిఫిన్స్ ఉండనున్నాయో అధికారులు అధికారికంగా ప్రకటించారు.
నిజానికి తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్.. మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాలలో పథకాన్ని ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. అయితే సీఎం ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. దీంతో ఆర్థిక మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ కోసం మొత్తం 45 నిమిషాల సమయం కేటాయించనున్నారు. జిల్లాల్లో తరగతులు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 8.45 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్‌లో తరగతులు ఉదయం 8.45 గంటలకు ప్రారంభవుతాయి కాబట్టి ఇక్కడ 8 గంటల నుంచే టిఫిన్ అందిస్తారు.
ప్రస్తుతం 119 చోట్ల పథకాన్ని ప్రారంభిస్తుండగా దసరా సెలవులు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23 లక్షలకుపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వ్యవసాయం, కూలీపనులు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల ఇబ్బందులను ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే ఇలాంటి పథకం ఇప్పటికే తమిళనాడులో విజయవంతంగా అమలవుతోన్న నేపథ్యంలో.. పథకం ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించి రావాలని సీఎం కేసీఆర్ అధికారుల బృందాన్ని తమిళనాడు పంపించారు. అక్కడ అమలవుతోన్న పథకంపై అధ్యయనం చేసిన తర్వాత ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు.
బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే..
విద్యార్థులకు వారం రోజుల పాటు ఏయే రోజు ఏ అల్పాహారం అందిస్తారంటే..
సోమవారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం – పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ
బుధవారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ
గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం – పొంగల్/సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..