సీఎం రేవంత్‎తో భేటీ వెనుక అసలు కారణం ఇదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టత..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది బీఆర్ఎస్. లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా రెండంకెల స్థానాలను గెలవాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్‎కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‎ను తన నివాసంలో మంగళవారం కలిశారు.

సీఎం రేవంత్‎తో భేటీ వెనుక అసలు కారణం ఇదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టత..
Cm Revanth Reddy

Updated on: Jan 24, 2024 | 9:04 AM

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది బీఆర్ఎస్. లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా రెండంకెల స్థానాలను గెలవాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్‎కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‎ను తన నివాసంలో మంగళవారం కలిశారు. దీంతో పార్టీ మరుతున్నారనే అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. సీఎం రేవంత్‎తో భేటీపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు ఎమ్మెల్యేలు. కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డిలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యదపూర్వకంగా కలిశారు. సీఎంతో తమ భేటీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్న నలుగురు ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారు. స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌, ప్రొటోకాల్‌ ఉల్లంఘన, గన్‌మెన్ల కుదింపు తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిశామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఎస్‌డీఎఫ్‌ నిధులు అర్ధాంతరంగా ఆపేయడం వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు. ప్రొటోకాల్‌ పాటించకుండా తమను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఈ  అంశాలు తప్ప మరే అంశాలు తమ మధ్య చర్చకు రాలేదని వివరించారు.

గత దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్‎లో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో దావోస్ పర్యటన ముగిచుకుని రేవంత్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఇలా సీఎంతో భేటీ అవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అలాగే లోక్ సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కూడా సంచలన కామెంట్స్ చేశారు. దీంతో నిజంగానే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతారా అన్న చర్చ మొదలైంది. సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు ముందు నుంచి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇటీవల రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలోని ప్రకాశ్ గౌడ్ నివాసానికి వెళ్లిన మంత్రి ప్రభాకర్ గౌడ్.. ఆయనతో భేటీ అయ్యారు. ప్రకాశ్ గౌడ్‌ను పొన్నం ప్రభాకర్ కలవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారానే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన క్లారిటీతో ప్రస్తుతానికి ఈ చర్చకు కాస్త బ్రేక్ పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..