Telangana Election: హత్యకు కుట్ర జరుగుతుందంటున్న రవిశంకర్.. ఓటమి భయంతోనే అరోపణలంటున్న కాంగ్రెస్

మొన్నటి వరకు ప్రశాంతంగా ‌జరిగిన‌ ఎన్నికల ‌ప్రచారానికి‌ ఇప్పుడు ‌హత్య రాజకీయాలు‌ తెరపైకి వచ్చాయి. తన చంపేందుకు కుట్ర జరుగుతుందని‌ స్థానిక ఎమ్మెల్యే ‌రవిశంకర్ అరోపిస్తున్నారు. అయితే ఓటమి ‌భయంతోనే దిగజారుడు‌ రాజకీయాలకు తెర లేపుతున్నారని కాంగ్రెస్ ‌అంటుంది. ఏ విచారణకైనా తాము‌‌ సిద్ధం అంటూ‌ సవాల్‌ విసురుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

Telangana Election: హత్యకు కుట్ర జరుగుతుందంటున్న రవిశంకర్.. ఓటమి భయంతోనే అరోపణలంటున్న కాంగ్రెస్
Medipally Satyam, Ravi Shankar

Edited By:

Updated on: Nov 21, 2023 | 7:18 PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్ధుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. కుట్రలు, హత్యాయత్నాలు తెరపైకి రావడంతో చొప్పదండి రాజకీయం హీటెక్కిపోతోంది. తనను హత్య చేసేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రయత్నిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే రవి శంకర్‌. ఆరోపణలు చేయడమే కాదు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు రవి శంకర్‌. అయితే, ఓటమి భయంతోనే రవిశంకర్‌ కొత్త డ్రామా మొదలుపెట్టారంటున్నారు కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం.

మొన్నటి వరకు ప్రశాంతంగా ‌జరిగిన‌ ఎన్నికల ‌ప్రచారానికి‌ ఇప్పుడు ‌హత్య రాజకీయాలు‌ తెరపైకి వచ్చాయి. తన చంపేందుకు కుట్ర జరుగుతుందని‌ స్థానిక ఎమ్మెల్యే ‌రవిశంకర్ అరోపిస్తున్నారు. అయితే ఓటమి ‌భయంతోనే దిగజారుడు‌ రాజకీయాలకు తెర లేపుతున్నారని కాంగ్రెస్ ‌అంటుంది. ఏ విచారణకైనా తాము‌‌ సిద్ధం అంటూ‌ సవాల్‌ విసురుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి లో రాజకీయాలు ఎప్పుడూ ‌ప్రశాంతంగా సాగుతాయి. హింసా దాడులకు‌ తావులేకుండా ప్రచారం కొనసాగుతుంటుంది. కానీ‌‌ ఈసారి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన కొద్దీ, హత్య రాజకీయాలు‌‌ కూడా ముందుకు‌ వస్తున్నాయి. స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ‌రవిశంకరే తనకి‌ ప్రాణహాని ఉందని ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే రెండు సార్లు దాడులకు తెగబడ్డారని, ప్రాణాలతో బయటపడి తప్పించుకున్నానని వెల్లడించారు.

అయితే ‌కాంగ్రెస్ నేతలు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మిడ్ మానేరు ‌నిర్వాసితుల ఆందోళన చేస్తుంటే ఇలాంటి హత్య ‌అరోపణలు చేయడం సిగ్గుమాలిన చర్యగా ‌చెబుతున్నారు. ఓటమి‌ ఖాయం కావడంతోనే ఎమ్మెల్యే రవిశంకర్ ఇలాంటి‌ జిమ్మిక్కులు చేస్తున్నారని‌ అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం. రవిశంకర్ ‌అరోపణలకి‌ కాంగ్రెస్ నేతలు‌ కూడా గట్టి కౌంటర్ ‌ఇచ్చారు. ఇప్పటికే రవిశంకర్ ‌ఈ‌ వ్యవహారం ‌పైనా పోలిసులకి‌ ఫిర్యాదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..