గోవా క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణను ఎదుర్కొన్న చికోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు ప్రవీణ్. గత కొంతకాలంగా తన ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తన కారు దొంగతనం ఈ కుట్రలో భాగమేననని అన్నారు. ప్రాణహానీ ఉన్నందుకు హైదరాబాద్ పోలీసులు తనకు సెక్యూరిటీ కల్పించాలని చికోటి ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలుసుకొని కొంతమంది టార్గెట్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
తనకు తెలిసిన వ్యక్తులే మర్డర్‌కు కుట్ర చేశారని అంటున్నారు చికోటి ప్రవీణ్. ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిన ఆగంతలు.. అక్కడ తిరిగిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాన్నారు. క్యాసినో వ్యవహారంలో కొందరు రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరింపులు వచ్చాయని , తాను అందుకు ఒప్పుకోకపోవడంతో టార్గెట్ చేశారని ఆరోపించారు. ముఖానికి ముసుగులు ధరించిన వ్యక్తులు తన ఇంటికి వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యిందని ప్రవీణ్ తెలిపారు. కాగా, చికోటి ప్రవీణ్ ఆరోపణలు ప్రస్తుతం కలకలం రేపాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..