తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కొండగట్టు పర్యటన బుధవారంకు వాయిదా పడింది. మంగళవారం భక్తుల రద్దీ కారణంగా సీఎం కేసీఆర్ పర్యటన బుధవారంకు వాయిదా పడినట్లు తెలుస్తుంది. కొండగట్టుకు వెళ్లనున్న సీఎం ఆలయ అభివృద్దికి సంబంధించిన పనులపై అధికారులకు సీఎం కేసీఆర్ చర్చిస్తారని తెలుస్తోంది. స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున మంగళవారం పర్యటనను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారని స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే యాదాద్రిని అభివృద్ధి చేసిన సీఎం కేఆర్ తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
అందుకే ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి వందకోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ కొండగట్టుకు రానున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొండగట్టుకు రావడం జరిగిందన్నారు ఆర్కిటెక్ సాయి. యాదాద్రి తర్వాత కొండగట్టును ఎంచుకోవడం శుభపరిణామం అన్నారు. ఈ ఆలయ అభివృద్ధిపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో చర్చించామన్నారు ఆనంద్ సాయి.
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయు కాలేజీలో హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. జేఎన్టీయు కాలేజీ నుంచి కొండగట్టు ఆలయానికి రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు గంటల పాటు పర్యటించారు అర్కిటెక్ ఆనంద్ సాయి. ఆలయ గర్భగుడితో పాటు ప్రధాన ముఖ ద్వారం, ధ్వజస్తంభం అనుబంధ అలయాలను పరిశీలించారు. స్థానిక అధికారులతో సమావేశమై కొండగట్టు అంజన్న దేవస్థానం పరిధిలో ఎంత భూమి ఉన్నదనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
గతంలో కొండగట్టులో ఉన్న మాస్టర్ ప్లాన్ అంశాలని కూడా అడిగి తెలుసుకున్నారు. భక్తుల రాకపొకలు, ఏయే రొజుల్లో భక్తుల రద్దీ ఉంటుందన్న అంశం మీద ఆరా తీశారు. పూర్తిగా ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయాన్ని పునః నిర్మించేలా డిజైన్లు తయారు చేస్తామన్నారు. కొండపై 108 అడుగుల అంజనేయ విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని వైపుల నుంచి భక్తులకు కనిపించేలా ఈ విగ్రహ నిర్మాణం జరగనుంది. మొదటి, రెండవ ప్రాకారాలు అగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం జరిగే విధంగా సమావేశంలో చర్చించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం