Chennur Election Result 2023: చెన్నూరులో దుమ్మురేపిన వివేక్.. బాల్క సుమన్ పరాజయం

Chennur Assembly Election Result 2023 Live Counting Updates: తలాపున ప్రాణహిత , గోదావరి పుణ్యనదుల పరవళ్లు.. మందమర్రిలో సింగరేణి సిరులు.. ప్రాచీన చరిత్రకు సజీవసాక్షంగా నిలుస్తున్న దశాబ్దాల నాటి ఆలయాలు.. కోటపల్లి , చెన్నూరు, భీమారంలో పుష్కలమైన అటవీ సంపదతో ఘనంగానే ఉంది చెన్నూరు నియోజక‌వర్గం. తాజాగా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు.

Chennur Election Result 2023: చెన్నూరులో దుమ్మురేపిన వివేక్.. బాల్క సుమన్ పరాజయం
Gaddam Vivek

Edited By:

Updated on: Dec 03, 2023 | 5:47 PM

Chennur Assembly Election Result 2023 Live Counting Updates: తలాపున జీవనదుల పరవళ్లు.. పచ్చని పంట పొలాలు.. నడిగడ్డపై సింగరేణి సిరులు.. సహజ సంపదకు కొదువలేని భూములు.. ఇది చెన్నూరు నియోజక వర్గ నైసర్గిక స్వరూపం. వలస నేతలకు రాజకీయ వరప్రదాయినిగా మారి మంత్రులను చేసింది చెన్నూరు నియోజక వర్గం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోటీ చేయగా.. ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం వివేక్ ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. బీజేపీ నుంచి దుర్గం అశోక్ పోటీ చేశారు. కానీ ఓటర్లు మాత్రం కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ 37189 ఓట్లతో సమీప అభ్యర్థి బాల్క సుమన్ పై విజయం సాధించారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

చెన్నూరు రాజకీయ ముఖచిత్రం..

మంచిర్యాల జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం చెన్నూర్. 1952 లో ఈ నియోజక వర్గం ఏర్పడింది. 16 సార్లు శాసన సభకు ఎన్నికలు జరగగా.. పద మూడు సార్లు‌ వలస నేతలే గెలుపొందారు. మందమర్రి , భీమారం, జైపూర్ , కోటపల్లి , చెన్నూర్ ఐదు మండలాలతో కలిపి నియోజక వర్గంగా కొనసాగుతోంది. ఈ ఐదు మండలాల్లో నేతకానీలదే అత్యధిక ఓటు బ్యాంక్. నియోజకవర్గంలో సుమారు 58 వేల మంది నేతకానీలు ఉండగా.. 35 వేల మంది మాలలు, 30 వేల మంది మాదిగ సామాజిక వర్గం ఓటర్లున్నారు. బీసీల్లో 10 వేల మంది కాపు, 8 వేల మందికి పైగా ముదిరాజ్ లు, 8 వేల మంది ముస్లింలు, 7 వేల మందికి పైగా రెడ్డి ఓటర్లు ఉన్నారు. నియోజక వర్గంలోని మందమర్రి మండలంలో 75 వేల మంది కి పైగా కార్మిక ఓటర్లు ఉండగా… ఈ కార్మిక ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపితే వారిదే విజయం అని గత ఎన్నికల ఫలితాలు చెపుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తంగా చూస్తే 1,84,117 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 91,969 మంది ఉంటే.. స్త్రీలు 92,141 ఓటర్లు, ఇక ఇతరులు ఏడుగురు ఉన్నారు.

1985 నుంచి 1999 వరకు వరుసగా నాలుగు సార్లు టీడీపీ నుంచి బోడ జనార్ధన్ ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2004లో జీ వినోద్ (కాంగ్రెస్) ఇక్కడ విజయం సాధించారు. 2009, 2010 ఉప ఎన్నికతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదేలు ఇక్కడి నుంచి పోటీ చేశారు. 2018లో నల్లాల ఓదేలును కాదని బాల్క సుమన్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చారు కేసీఆర్. బాల్క సుమన్ 28,132 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్ నేతా బోర్లకుంటపై విజయం సాధించారు.

తలాపున ప్రాణహిత , గోదావరి పుణ్యనదుల పరవళ్లు.. మందమర్రిలో సింగరేణి సిరులు.. ప్రాచీన చరిత్రకు సజీవసాక్షంగా నిలుస్తున్న దశాబ్దాల నాటి ఆలయాలు.. కోటపల్లి , చెన్నూరు, భీమారంలో పుష్కలమైన అటవీ సంపదతో ఘనంగానే ఉంది చెన్నూరు నియోజక‌వర్గం. కానీ అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని‌ అన్నట్టుగానే నిన్న మొన్నటి వరకు నియోజక వర్గం అభివృద్దికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది. 2018 లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును కాదని అప్పటి పెద్దపల్లి ఎంపీ యువనేత బాల్క సుమన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గా కేసీఆర్ అవకాశం ఇచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్