Telangana: 9 ఏళ్లలో కరువు, కర్ఫ్యూ లేదు : కేటీఆర్
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చెబుతోన్న కర్ణాటక మోడల్‌ను ఎద్దేవా చేశారాయన. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్ల పాటు ఇబ్బందులు పడిందని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు బీజేపీ చేసింది గుండుసున్నా అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతుందని జోస్యం చెప్పారాయన.
హ్యాట్రిక్ విజయమే టార్గెట్‌గా బీఆర్‌ఎస్ ఉధృతంగా ప్రచారం చేస్తుంది. ఇంకా నామినేషన్ల పర్వం మొదలవ్వక ముందే.. యాక్షన్‌లోకి దిగిపోయింది. ఒకటి, రెండు మినహా అన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ ఫైనల్ అవ్వడంతో.. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు అగ్రనేతలు. మరోసారి బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రసంగాల్లో అంశాలను ఎప్పటికప్పుడు మారుస్తూ జనంలోకి వెళ్తున్నారు.
కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తుంది బీఆర్‌ఎస్. తెలంగాణ రాకముందు కష్టాలను చెబుతూ.. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తీసుకొచ్చిన మార్పులను వివరిస్తూ.. కొత్త హామీలు ఇస్తూ.. కాంగ్రెస్, బీజేపీలపై ముఖ్య నేతలపై విరుచుకుపడుతున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

