Viral Video: మంత్రి మల్లారెడ్డి సార్ విన్యాసాలు మరో లెవల్‌కు

Viral Video: మంత్రి మల్లారెడ్డి సార్ విన్యాసాలు మరో లెవల్‌కు

Ram Naramaneni

|

Updated on: Oct 28, 2023 | 1:48 PM

ఆయన మాటలు మతాబులే. సామెతలు చెబితే చిచ్చుబుడ్లే..పంచ్‌ డైలాగులు విసిరితే పటాస్‌లే..మధ్యలో స్వామిభక్తి మస్ట్‌..ముందూ వెనకా ప్రతిపక్షాలను రోస్ట్‌..అదే ఆయనలోని పొలిటికల్‌ బెస్ట్‌ టేస్ట్.. ఆయన మంత్రి మల్లారెడ్డి కాదు.. మాస్‌ మల్లారెడ్డి. ఆయన చేసే పనులు, మాట్లాడే మాటలు అలా ఉంటాయ్‌ మరి. ఆయన ఏం మాట్లాడినా సెన్సేషన్‌.. ఏం చేసినా ఏదో ఒక వైబ్రేషన్‌ అన్నట్టుగా ఉంటుంది. తాజాగా ఎన్నికల సీజన్‌ స్టార్టవ్వడంతో ఆయన యాక్షన్‌ షురూ చేశారు. ఓ వృద్ధురాలిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని.. తనకు ఓటేయాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు .

కష్టపడ్డా..  పాలమ్మిన.. పూలమ్మిన.. బోరె‌వెల్ నడిపినా అంటూ పంచ్‌ డైలాగ్స్ పేల్చే మంత్రి మల్లారెడ్డి.. ఎన్నికల సీజన్‌లో తన జోష్ చూపిస్తున్నారు. తాజాగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన మహిళలు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో BRS తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో మహిళలు అంతా.. కింద కూర్చుని ఉండగా మంత్రి సైతం వారితో కిందే ఆసీనులయ్యారు. ఈ  సమయంలో తెలంగాణకు, కేసీఆర్‌కు అనుకూలంగా ఓ వృద్ధురాలు నినాదాలు చేసింది. దీంతో ఆమెను ముందుకు పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకొని ఫోటోకు స్టిల్స్ ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డి చేసిన పని చూసిన అక్కడ వారంతా ఖంగుతిన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఓట్ల కోసం మరీ ఇంతలా వృద్ధురాలిని మంత్రి ఇలా ఇబ్బంది పెడతాడా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Oct 28, 2023 01:47 PM