మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. హర్షకి చెన్నై కస్టమ్స్ అధికారుల నోటీసులు ఇచ్చారు.
స్మగుల్డ్ గూడ్స్‌కు సంబంధించిన కేసులో ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశించారు. ఐతే.. తనకు ఒంట్లో బాగా లేదని ఆ రోజు వెళ్లలేదు.
ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని పొంగులేటి హర్ష రిప్లై ఇచ్చారు. హర్ష కోసం సింగపూర్ నుంచి 2 వాచ్‌లు ముబిన్ అనే స్మగ్లర్ తెప్పించాడు. పటెక్ ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్‌ల లగ్జరీ వాచ్‌లను హర్ష ఆర్డర్ చేశారు. భారత్‌లో దొరకని ఈ బ్రాండ్లను హర్ష కోసం తెచ్చాడు ముబిన్..
ముబిన్ నుంచి రెండు వాచ్‌లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఇప్పుడు హర్షకు నోటీసులు ఇచ్చారు. హర్షారెడ్డి కోసం తెచ్చిన ఒక్కో వాచ్ ఖరీదు రూ. 1.75 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ వాచ్‌లకు హవాలా రూపంలో డబ్బు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న కేసు నమోదు చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలా స్మగుల్డ్ గూడ్స్ రూపంలో తెచ్చిన వాచ్‌ల స్కామ్ విలువ 100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముబిన్, హర్షారెడ్డికి నవీన్ కుమార్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ఇప్పటికే నవీన్ కుమార్‌ని విచారించారు కస్టమ్స్ అధికారులు. స్మగ్లింగ్ వాచ్ కుంభకోణం రూ.100 కోట్లు పైబడి ఉంటుందని కస్టమ్స్ అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…