మావోయిస్టు రహిత తెలంగాణే లక్ష్యంగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసులు.. తాజాగా మావోయిస్టు చర్యలను తిప్పికొట్టారు. పోలీసులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్‌ను ఎంతో చాకచక్యంగా నిర్వీర్యం చేశారు చర్ల పోలీసులు. అటవీ ప్రాంతంలో ల్యాండ్‌మైన్ నిర్వీర్యం చేసిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులే లక్ష్యంగా చేసుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం ఒద్దిపేట-పూసుగుప్ప రహదారిపై మావోయిస్టులు 15 కేజీల ల్యాండ్‌మైన్‌ను అమర్చారు.
అయితే, ఈ ల్యాండ్‌మైన్‌ను గుర్తించిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ సాయంతో దానిని వెలికి తీశారు. అనంతరం ఆ మందుపాతరను నిర్వీర్యం చేశారు పోలీసులు. కూంబింగ్ సమయంలో ఈ బాంబ్‌ను గుర్తించిన పోలీసులు.. అటవీ ప్రాంతంలో పేల్చేశారు. అయితే, బాంబు నిర్వీర్యం చేసిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాంబు పేలుడు ధాటికి భూమిపై భారీ గొయ్యి పడింది. అదృష్టం కొద్ది పోలీసులు దానిని ముందే పసిగట్టారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత దారుణం జరిగి ఉండేదో అని వీడియో చూసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ మైన్ పవర్ ఈ రేంజ్‌లో ఉంటుందాని నోరెళ్లబెడుతున్నారు వీడియో చూసిన నెటిజన్లు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..